Janasena Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు బకెట్ గుర్తు దెబ్బ..

Janasena Pawan Kalyan:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో గెలుపు టార్గెట్ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు  ఇప్పటికే కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో ఉంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా పవన్ కల్యాన్ జనసేన పార్టీకి మరో ఊహించని ఘటన ఎదురైంది.   

Written by - Inamdar Paresh | Last Updated : Apr 11, 2024, 10:10 PM IST
  • జనసేనానికి తలనొప్పిగా మారిన బకెట్ గుర్తు..
  • జగన్ స్కెచ్ లో భాగమంటూ కామెంట్లు చేస్తున్న అపోసిషన్ నేతలు..
Janasena Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు బకెట్ గుర్తు దెబ్బ..

Pithapuram Controversy Between Pawan Kalyan Glass And Backet Symbol: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సమ్మర్ హీట్ ను మరింతగా పెంచుతున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్సార్సీపీ వైనాట్ 175 అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంది. ప్రజల కోసం తీసుకొచ్చిన పథకాలు, లభ్దిదారులకు జరిగిన మంచిని వివరించి, తమకు అధికారం కట్టబెట్టాలని ప్రచారం నిర్వహిస్తుంది. సీఎం జగన్ సిద్ధం సభల ద్వారా ఇటు అపోసిషన్ లీడర్లను ఏకీపారేస్తు, మరోవైపు ప్రచారంలో స్పీడ్ ను పెంచారు. ఇదిలా ఉండగా..ఈసారైన అధికారం సాధించడమే టార్గెట్ గా.. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.

Read More: Romance In Flight: విమానంలో కపుల్ అరాచకం.. 4 గంటల పాటు హగ్గింగ్ చేసుకుంటూ రొమాన్స్.. వైరగా మారిన ఘటన..

చంద్రబాబుకూడా, పవన్ కల్యాణ్, కూడా తమదైన స్టైల్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికలలో ముఖ్యంగా పవన్ కల్యాన్ బరిలో నిలబడిన రెండు స్థానాల్లో కూడా ఓటమి పాలయిన విషయం తెలిసిందే. ఈసారి ఎలాగైన పట్టుదలతో జనసేనాని పిఠాపురంనుంచి బరిలో నిలిచారు. అయితే.. ఎన్నికల సంఘం జనసేనానికి మరో ట్విస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. పిఠాపురం నుంచే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి,  కనుమూరీపవన్ కల్యాణ్ అనే వ్యక్తి బరిలో ఉంటున్నారు. ఆయనకు ఎన్నికల సంఘం బకెట్ గుర్తును కేటాయించింది.

అయితే.. ఇది పవన్ కల్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా జనసేన పవన్ కల్యాణ్ పేరును పోలి ఉండటం, మరో విధంగా గాజు గ్లాసును బకెట్ పొలి ఉండటంతో ఈవీఎంలలో ప్రజలు కన్ఫూజ్ అయ్యే అవకాశం ఉందని పవన్ టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. గాజుగ్లాసును జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే పవన్ నానా తంటాలు పడుతున్నారు. సినిమాలో డైలాగ్ లతో కూడా ప్రజల్లో, ఫ్యాన్స్ లోకి వెళ్లేలా మరీ తన ప్రయత్నంచేశారు.

Read More: Snakes: ఇదేం విడ్డూరం.. పాముల్ని పెంచుకుంటున్న గ్రామస్థులు.. హనీ కలిగిస్తే అరెస్ట్ చేస్తారంట..

ఈక్రమంలో తాజాగా, పవన్ పేరుతో, పవన్ గుర్తుకు దగ్గరగా పోలికలు ఉన్న.. కనూమూరీ పవన్ కల్యాణ్, బకెట్ గుర్తు జనసేనానికి తెగ ఇబ్బంది పెడుతున్న అంశంగా మారింది. పవన్ ను ఓడించమే టార్గెట్ ఈ నియోజక వర్గానికి సీఎం జగన్... ఎంపీ మిథున్ రెడ్డి, కాపు ఉద్యమ నేత ముద్రగడలను ఇన్ చార్జీలుగా కూడా నియమించడం జరిగింది. ఈ క్రమంలో.. పవన్ కల్యాణ్ ను కావాలనే ఎన్నికలలో ఓడిపోయేలా, ఓట్లను చీలే విధంగా ఇలా ఎత్తులు వేసినట్లు టీడీపీ, జనసేన వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఈ బకెట్ గుర్తు, కనుమూరీ పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలో నిలబడటం మాత్రం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News