Breaking News: ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం

Mekapati Goutham Reddy Death: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తీరని ఆవేదన. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 21, 2022, 01:08 PM IST
  • ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం
  • గుండెపోటుతో ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి
  • ఆత్మకూరు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి...2019లో మంత్రి అయిన గౌతమ్ రెడ్డి
Breaking News: ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం

Mekapati Goutham Reddy Death: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తీరని ఆవేదన. రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందారు. 

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇక లేరు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఇవాళ కాస్సేపటి క్రితం కన్ను మూశారు. వారం రోజుల దుబాయ్ పర్యటన ముగించుకుని నిన్న అంటే ఆదివారం హైదరాబాద్ చేరుకున్న మంత్రి గౌతమ్ రెడ్డికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దాంతో వెంటనే అపోలో ఆసుపత్రిలో చేర్చి అత్యవసర చికిత్స అందించసాగారు. దురదృష్ఠవశాత్తూ కాస్సేపటి క్రితం తుది శ్వాస విడిచారు. చికిత్స సమయంలో ఆయనకు శ్వాస తీసుకోవడం కష్టమైందని వైద్య వర్గాలు తెలిపాయి. 2019 ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయ్యారు.

1971 నవంబర్ 2న జన్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంగ్లండ్ లోని మాంఛెస్టర్ విశ్వవిద్యాలంయలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2014 ఎన్నికల్లో రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన..ఆత్మకూరు నుంచి తొలిసారి పోటీ చేసి గెలిచారు. నిన్న గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేర్చి అత్యవసర చికిత్స అందించినా..ఫలితం లేకపోయింది. 

Also read: Pawan Kalyan Rally: ర్యాలీలో అపశ్రుతి.. జనసేనాని పవన్ కల్యాణ్ కు తప్పిన ప్రమాదం! Video

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News