AP Election Guidelines: ఏపీలో ఎన్నికల మార్గదర్శకాలు, సూచనలు జారీ, ఏప్రిల్ 15 వరకూ కొత్త ఓటర్లకు ఛాన్స్

AP Election Guidelines: దేశలో లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా కొత్త ఓటర్ల నమోదుకు మరో చివరి అవకాశం కల్పించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 18, 2024, 09:18 AM IST
AP Election Guidelines: ఏపీలో ఎన్నికల మార్గదర్శకాలు, సూచనలు జారీ, ఏప్రిల్ 15 వరకూ కొత్త ఓటర్లకు ఛాన్స్

AP Election Guidelines: ఎన్నికల షెడ్యూల్ విడుదలతో పాటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశారు. ఏపీ ఓటర్ల జాబితా విడుదల చేసిన ఏపీ ఎన్నికల కమీషన్..కొత్త ఓటర్ల నమోదుకు మరో అవకాశం కల్పించింది. ఏప్రిల్ 15 వరకూ కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. 

ఏపీలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో హోర్డింగులు, పోస్టర్లు, కటౌట్లను మద్యాహ్నం 3 గంటల్లోపు తొలగించాలని ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లోనూ, ప్రచారానికి తీసుకోవద్దని ఎన్నికల కమీషన్ స్పష్టం చేసింది. ఎన్నికల విధుల్లో టీచర్లు ఉంటారని ఈసీ తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని కేవలం సహాయక పనులకే ఉపయోగించాలని స్ఫష్టం చేసింది. 

ఏపీలో మొత్తం 4 కోట్ల 9 లక్షల 37 వేల 352 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2 కోట్ల 84 వేల 276 మంది పురుషులు కాగా 2 కోట్ల 8 లక్షల 49 వేల 730 మంది మహిళలున్నారు. ఇతరులు 3,346 మంది ఉంటే ఎన్ఆర్ఐలు 7,763 మంది ఉన్నారు. ఇక సర్వీస్ ఓటర్లు 67,393 మంది కాగా, 85 ఏళ్లు పైబడినవారి 2,12,237 మంది ఉన్నారు. 

మరోవైపు ఏపీలో కొత్త ఓటర్ల నమోదుకు ఇంకా చివరి అవకాశం ఉందని ఎన్నికల కమీషనర్ ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఏప్రిల్ 15 వరకూ కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. గత నెలన్నరరోజుల్లో 1.75 లక్షల కొత్త ఓటర్లు నమోదయ్యారన్నారు. ఏప్రిల్ 15 వరకూ వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి అర్హులైనవారికి ఓటు హక్కు కల్పిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,165 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కాగా వాటిలో 179 కేంద్రాల్లో కేవలం మహిళా సిబ్బంది మాత్రమే విధుల్లో ఉంటారు. 

ఎన్నికల సంఘం జారీ చేసిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఓట్ ఫ్రం హోం సౌకర్యం కల్పించనున్నారు. ఓట్ ఫ్రం హోం సౌకర్యం కోసం ఫామ్ 12 నింపాల్సి ఉంటుంది. ఇప్పటికే అందుతున్న సంక్షేమ పధకాల లబ్దిదారులకు ప్రయోజనాలు కొనసాగించవచ్చు. కొత్తగా లబ్దిదారుల్ని ఎంపిక చేయకూడదు.

Also read: Perni Nani: దొంగలు దొంగలు కూడబలుక్కున్నట్టు 'మోదీ, చంద్రబాబు, పవన్' కలయిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News