Nagababu As AP Cabinet Minister: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు త్వరలో ఆంధ్ర ప్రదేశ్ లో క్యాబినెట్‌లో చోటు దక్కనుంది. ఏపీలో 25 మంత్రి పదవులకు అవకాశం ఉంది. ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. జనసేన నుంచి క్యాబినెట్‌లో పవన్ కల్యాణ్, కందుల దుర్గేశ్, నాదెండ్ల మనోహర్ కొనసాగుతున్నారు.
కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు 4, బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. దాంతో భర్తీ కావాల్సి ఆ స్థానంలో నాగబాబుకు అవకాశం కల్పించనున్నారు. త్వరలో నాగబాబు ఒక్కరే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒక రకంగా చూస్తే మెగా కుటుంబం నుంచి అటు అన్నయ్య చిరంజీవి.. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే అప్పటి మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో పర్యాటక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇపుడు అదే ఇంటి నుంచి మెగా బ్రదర్ నాగబాబు త్వరలో ఆంధ్ర ప్రదేశ్ చంద్రబాబు మంత్రి వర్గంలో క్యాబినేట్ మంత్రి కాబోతున్నారు.
ఇదీ చదవండి: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
ఒక రకంగా ఒకే ఇంట్లో ముగ్గురు వ్యక్తులు కమ్ హీరోలు మంత్రులు అయిన ఘనత కొణిదెల ఫ్యామిలీకే దక్కుతుంది. ఈయనకు ఏపీలో పవన్ కళ్యాణ్ నిర్వహించే కొన్ని శాఖల్లో ఒకటో రెండో కీలక శాఖలను నాగబాబుకు అప్పగించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మెగా బ్రదర్ ఏపీ శాసనసభ సభ్యుడు కాడు.దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వం త్వరలో నాగబాబును శాసనమండలికి పంపించి మంత్రిని చేయనున్నారు.
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..మరోవైపు మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ నుంచి ఒకరిని, టీడీపీ నుంచి ఇద్దర్ని కూటమి అధిష్టానం ఎంపిక చేసింది. టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు, సానా సతీష్ పేర్లు ఖరారయ్యాయి. ఇక సానా సతీష్ ..జనసేనకు తరుపున గత ఎన్నికల్లో కాకినాడ నుంచి పోటీ చేయాలననున్నారు. ఏదో కారణాల రీత్యా పక్కకు తప్పుకున్నారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ జనసేన కోటాలో టీడీపీ తరుపున సతీష్.. ఎంపీగా రాజ్యసభకు వెళుతున్నారు. మరోవైపు బీజేపీ తరుపున ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు నామినేట్ చేసారు. రేపు నామినేషన్ కు చివరి రోజు కాబట్టి ఈ ముగ్గురు నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. పోటీలో ఎవరు లేకపోవడంతో వీరి ఎన్నికల ఏక గ్రీవం కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.