Jahnavi Kapoor: తిరుమల శ్రీవారి సేవలో శ్రీదేవి కూతురు..లంగావోణీలో మెరిసిన జాన్వీ కపూర్..

Jahnavi Kapoor: బాలీవుడ్‌ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2021, 12:49 PM IST
  • తిరుమలలో బాలీవుడ్ హీరోయిన్
  • శ్రీవారిని దర్శించుకున్న జాన్వీకపూర్
  • ప్రస్తుతం దోస్తానా-2, గుడ్‌లక్‌ జెర్రీ చిత్రాల్లో నటిస్తున్న నటి
Jahnavi Kapoor: తిరుమల శ్రీవారి సేవలో శ్రీదేవి కూతురు..లంగావోణీలో మెరిసిన జాన్వీ కపూర్..

jhanvi kapoor visits tirumala: దివగంత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని (jhanvi kapoor visits tirumala) దర్శించుకున్నారు. శనివారం తిరుమల వచ్చిన ఆమె... ఆదివారం తెల్లవారుజామున స్వామి వారి సేవలో పాల్గొన్నారు. సాంప్రదాయమైన దక్షిణ భారత లెహంగా చీర ధరించింది జాన్వి (jhanvi kapoor). ఆమెకు అర్చకులు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల క్షేత్రంలో జాన్విని చూసిన అభిమానులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు.జాహ్నవి తన స్నేహితురాలితో కలిసి తిరుమలను సందర్శించింది. 

ప్రస్తుతం జాన్వీకపూర్..‘దోస్తానా-2’, ‘గుడ్‌లక్‌ జెర్రీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. నటి శ్రీదేవి (Actress Sridevi)కి తిరుమలతో ప్రత్యేక అనుబంధం ఉంది. సినిమా, వ్యక్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నా ప్రతి ఏడాది ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకునేవారు. తన తల్లిలానే తనకీ తిరుమల (Tirumala) అంటే ఎంతో ఇష్టమని.. స్వామి  సన్నిధిలోనే తాను పెళ్లి చేసుకుంటానని జాన్వి ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ (Viral)గా మారాయి. అయితే తెలుగు ప్రేక్షకులు జాన్వి తెలుగు సినిమాల్లో నటించాలని.. తల్లి శ్రీదేవిలా అలరించాలని  కోరుకుంటున్నారు.

TTD Darshan Tickets Booking: శ్రీవారి దర్శనం టికెట్లకు భారీ డిమాండ్.. గంటలో అమ్ముడైన స్పెషల్ దర్శనం టికెట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News