Vizag Airport: విశాఖ విమానాశ్రయంలో వృద్ధురాలి బ్యాగ్‌లో బుల్లెట్లు లభ్యం

Bullets found in baggage : బీచ్‌రోడ్డులో ఉండే టి.సుజాత (73) ఇటీవల ఇల్లు ఖాళీ చేసి, హైదరాబాద్‌లో ఉండే తన కుమారుడి ఇంటికి వెళ్ల్లిపోయారు. ఇంట్లో మిగిలిన సామాన్లు తీసుకెళ్లేందుకు రెండురోజుల కిందట ఆమె వైజాగ్‌కు వచ్చారు. తాజాగా హైదరాబాద్‌ వెళ్లేందుకు ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకున్నారు. అయితే బోర్డింగ్‌ టైమ్‌లో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు (immigration officers) ఆమె బ్యాగ్‌ చేయగా........

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 6, 2021, 09:58 AM IST
  • 73 ఏళ్ల వృద్ధురాలి దగ్గర బుల్లెట్స్
  • 13 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం
  • విశాఖ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు చిక్కిన బుల్లెట్స్
Vizag Airport: విశాఖ విమానాశ్రయంలో వృద్ధురాలి బ్యాగ్‌లో బుల్లెట్లు లభ్యం

13 rounds Bullets found in baggage of air passenger in Vizag: ఒక పెద్దావిడ బ్యాగ్‌లో ఏకంగా బుల్లెట్లు బయటపడ్డాయి. 73 ఏళ్ల వృద్ధురాలి దగ్గర ఈ బుల్లెట్స్ (Bullets) దొరకడంతో పోలీసులు కూడా ఆశ్చర్చపోయారు. అసలు ఆమె బుల్లెట్స్‌ను (Bullets) అలా బ్యాగులో పెట్టుకుని తిరగడానికి కారణం ఏమిటి.. ఇంతకు ఏంటీ ఆ కథ అనేది ఒకసారి చూద్దామా. 

విశాఖపట్నం విమానాశ్రయంలో (visakhapatnam airport) ఒక వృద్ధురాలి నుంచి 13 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బీచ్‌రోడ్డులో ఉండే టి.సుజాత (73) ఇటీవల ఇల్లు ఖాళీ చేసి, హైదరాబాద్‌లో ఉండే తన కుమారుడి ఇంటికి వెళ్ల్లిపోయారు. ఇంట్లో మిగిలిన సామాన్లు తీసుకెళ్లేందుకు రెండురోజుల కిందట ఆమె వైజాగ్‌కు వచ్చారు. తాజాగా హైదరాబాద్‌ వెళ్లేందుకు ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకున్నారు. అయితే బోర్డింగ్‌ టైమ్‌లో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు (immigration officers) ఆమె బ్యాగ్‌ చేయగా 13 రౌండ్ల బుల్లెట్లు బయటపడ్డాయి.

Also Read : Elon Musk: ఎలన్‌ మస్క్‌కి సొంత కంపెనీ నుంచే భారీ షాక్‌, మస్క్‌కు రూ.70 వేల కోట్లదాకా జరిమానా విధించే అవకాశం

అయితే తన పెదనాన్నకు తుపాకీ లైసెన్సు (gun licence) ఉండేదని, ఇటీవలే ఆయన మరణించారని ఆమె పోలీసులకు తెలిపారు. ఆయన బ్యాగ్‌లోనే తన సామగ్రిని పెట్టుకొని వెళ్తున్నానని, అందులో బుల్లెట్లు ఉన్నట్లు తనకు తెలియదని చెప్పారు ఆ వృద్ధురాలు. అయితే ఆమె వద్ద అందుకు సంబంధించిన ఎలాంటి లైసెన్స్(licence), డాక్యుమెంట్స్ (documents) లేవు. దీంతో విశాఖపట్నం (visakhapatnam) ఎయిర్‌పోర్ట్ పోలీసుస్టేషన్‌లో (airport police station) ఆ వృద్ధురాలిపై కేసు నమోదైంది.

Also Read : amantha: సమంత అభిమానులకు గుడ్‌న్యూస్, ఇక హైదరాబాద్‌లోనే నివాసం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News