India Coronavirus update: భారత్‌లో కరోనా వినాశకర పరిస్థితులు : ప్రపంచ ఆరోగ్య సంస్థ

India Coronavirus update: కరోనా వైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రపంచదేశాలన్నీ ఇండియాపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన వ్యాఖ్యలు కరోనా వినాశకర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 24, 2021, 05:31 PM IST
India Coronavirus update: భారత్‌లో కరోనా వినాశకర పరిస్థితులు : ప్రపంచ ఆరోగ్య సంస్థ

India Coronavirus update: కరోనా వైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రపంచదేశాలన్నీ ఇండియాపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన వ్యాఖ్యలు కరోనా వినాశకర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

కరోనా వైరస్(Corona virus). అత్యంత ప్రమాదకర మహమ్మారి. నిర్లక్ష్యం ఏ మాత్రం చేసినా ఫలితం ఎలా ఉంటుంది..ఏ స్థాయిలో విజృంభిస్తుందనడానికి నిదర్శనం ఇండియానే. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అథనామ్(World health organisation Director Tedros Adhanom). కరోనా వైరస్ నిర్లక్ష్యానికి ఫలితం ఎటువంటి వినాశకర పరిస్థితులకు దారితీస్తుందనేది ఇండియాలో చూడవచ్చని అన్నారు. ఇండియాలో పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయని..వాటిని ఎదుర్కొనేందుకు భారతదేశ ప్రభుత్వం ( Indian government) తీసుకుంటున్న చర్యల్ని స్వాగతిస్తున్నట్టు టెడ్రోస్ అథనామ్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఆప్తుల్ని కోల్పోయినవారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

కరోనా మహమ్మారి (Corona pandemic) ఏం చేయగలదనేందుకు ఇండియాలోని వినాశకర పరిస్థితులే గుర్తు చేస్తున్నాయని టెడ్రోస్ తెలిపారు. ప్రజారోగ్య చర్యలు, వ్యాక్సినేషన్( Covid vaccination), చికిత్స వంటి సమగ్ర విధానాలతో వైరస్‌కు వ్యతిరేకంగా ముందుకెళ్లాలని ఆయన ఇండియాకు సూచించారు. వైరస్‌ను తక్కువగా అంచనా వేస్తే ఎదురయ్యే పరిస్థితులపై ప్రపంచ దేశాల్ని ఆయన హెచ్చరించారు. కరోనా నిబంధనలు పాటించకపోవడం, వ్యాక్సిన్ తీసుకోవపోవడం వంటి నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలామంది మరణిస్తున్నారని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రపంచంలోనే అత్యధిక కేసులు ఇండియాలో నమోదవుతున్నాయి. అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆక్సిజన్, వ్యాక్సిన్, ఇంజక్షన్ కొరత వేధిస్తోంది. ఇప్పటికే ఆక్సిజన్ కొరత కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చాలామంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3.5 లక్షల కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 

Also read: Virafin medicine: కరోనా చికిత్సలో మరో కొత్త మందుకు డీసీజీఐ అత్యవసర అనుమతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News