కోలంబియాకు ( Columbia ) చెందిన ఒక మహిళ రెండు సంవత్సరాల ముందు మిస్సయింది. తరువాత ఇటీవలే ఆమె ఒక సముద్రంలో ( Sea ) తేలుతూ కనిపించడంతో కొంత మంది జాలర్లు అమెను రక్షించారు. అధికారులు ఆమెను తన కుటుంబం వద్దకు చేర్చారు. 46 సంవత్సరాల యాంజెలికా గైటిన్ పుర్టో కొలంబియా సమీపంలోని సముద్రంలో సుమారు 1.2 కిలీమీటర్ల దూరంలో రబ్బరు రింగు సహాయంతో ప్రాణాలు కాపాడుకోగలిగింది.
ALSO READ| Driving at Night: డ్రైవింగ్ చేస్తోంటో నిద్ర వస్తోందా? ఇలా చేయండి
నీటిలో ఎక్కువ సమయం గడపడంతో ఆమెకు హైపోథెర్మియా వచ్చింది. నీటిలో ఏదో కదులుతోంది అని గమనించిన రోనాల్డో విస్బాల్ అనే జాలరి ఆమె వద్దకు చేరి రక్షించి స్థానికుల సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
వాస్తవానికి రోనాల్డో అతనితో ఉన్న సభ్యులు ఏదో నావ నుంచి విడిపోయిన భాగం అనుకుని వేరే దిశలో ప్రయాణించడానికి సిద్ధం అయ్యారు. కానీ యాంజెలికా తన శక్తిని అంతా కూడగట్టుకుని చేతితో వారికి సంకేతాన్నిపంపించింది. దాంతో జాలరులు టీమ్ అక్కడికి చేరుకుని ఆమెను బోటు ( Boat ) పైకి ఎక్కించారు. ప్రాణాలు దక్కినందుకు సంతోషంతో ఆమె గట్టిగా ఏడ్చింది. ప్రాణాలు నిలబెట్టిన రొనాల్డో టీమ్ కు థ్యాంక్స్ చెప్పింది.
ALSO READ| Mukesh Ambani Facts: ముఖేష్ అంబానీ నిమిషానికి 23 లక్షలు సంపాదిస్తాడు తెలుసా ?
అయితే రెండు సంవత్సరాల ముందుకు ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణం కూడా చెప్పింది యాంజెలినా. తన భాగస్వామితో ఇబ్బంది వల్ల వెళ్లిపోయాను అని తెలిపింది. ఆరు నెలల పాటు రోడ్లపై తిరిగిన తరువాత స్థానిక మహిళల సమాయంతో ఆమె ఒక ఆశ్రమంలో చేరింది. అయితే తన మాజీ ప్రియుడి జాడ తెలియపోవడంతో ఆమె మనస్థాపానికి గురి అయింది. దాంతో ప్రాణాలు విడిచిపెట్టడానికి సముంద్రంలో దూకింది. అయితే మళ్లీ ఒక రబ్బరు రింగు కనిపించడంతో దాన్ని పట్టుకుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసింది.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR