Gold Mines Tragedy: దక్షిణాఫ్రికాలోని బంగారుగనుల్లోని అక్రమ తవ్వకాలు చేపట్టడానికి వెళ్లి వందలాది మంది అక్కడే చిక్కుకోవడం సంగతి తెలిసిందే. వీరిని రక్షించేందుకు మొదట ససేమీర అన్న అక్కడ సర్కార్ పౌరసంఘాల ఒత్తిడితో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. దీనిలో భాగంగా ఓ క్రేన్ లోనికి పంపించింది. అయితే కొన్ని నెలలుగా అందులో చిక్కుకుపోయిన వారిలో దాదాపు 100 మందికి పైగా కార్మికులు ఆకలి,డీహైడ్రేషన్ తో మరణించినట్లు అంచనా వేస్తున్నారు.
బంగారు నిల్వలు అధికంగా ఉండే దక్షిణాఫ్రికాలో అక్రమమైనింగ్ సర్వసాధారణమే. వందల సంఖ్యలో ఉన్న పాడుబడిన బంగారు గనులు వీటికి అడ్డగా మారుతున్నాయి. తవ్వకాల కోసం గనిలోకి వెళ్లే కార్మికులు నెలల పాటు అందులోనే ఉండిపోతున్నారు. ఆహారం, నీటితో పాటు జనరేటర్లు ఇతర పరికరాలను లోనికి తీసుకెళ్తారు. ఈ అక్రమ తవ్వకాలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఆపరేషన్ క్లోజ్ ది హోల్ 2023 డిసెంబర్లో చేపట్టింది. దీనిలో భాగంగా దాదాపు 13 వేల మందిని అరెస్టు చేసింది. దీంతో అరెస్ట్ కు భయపడి అనేకమంది కార్మికులు 2.5 కిలోమీటర్ల లోతు ఉండే స్టీల్ ఫౌంటెన్ గనిలో తలదాచుకున్నారు. అయితే వీరిని బయటకు రప్పించేందుకు విఫల ప్రయత్నం చేసిన పోలీసులు.. నీరు, ఆహారం చేరవేసే మార్గాలను మూసివేశారు.
Also Read: New Scheme: మహిళలకు కోసం కేంద్రం మరో సాయం.. ఈ నగదు బదిలీ పథకం గురించి తెలుసుకోండి
వారిని బయటకు తీసుకొచ్చే ప్రసక్తే లేదని తెలిపారు. దీంతో వందలాదిమంది గనిలోనే ఉండిపోయారు. ఆకలితో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే 96 మంది మరణించారు. మాకు సహాయం చేయండి.. ఆహారం ఇవ్వండి లేదా బయటకు తీసుకురండి.. అంటూ ఓ కార్మికుడు రికార్డ్ చేసిన ఓ వీడియో ఇటీవల బయటకు వచ్చింది. కార్మికుల దుస్థితిపై ఇలా అనేక వీడియోలు బయటకు రావడంతో పాటు ఒక కార్మీకుడి కుటుంబ న్యాయస్థానం ఆశ్రయించింది. దీంతో చర్యలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా సహాయక చర్యలను చేపట్టింది. జనవరి 10 నుంచి ఇప్పటివరకు 35 మందిని సురక్షితంగా రక్షించినట్లు 24 డెడ్ బాడీలు తీసినట్లు అధికారులు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఒక్కరోజే 8 మందిని ప్రాణాలతో మరో ఆరుగురు డెడ్ బాడీలను బయటకు తీసుకు వచ్చామని చెప్పారు.
Also Read:Union Budget 2025: వ్యాపారస్థులకు నిర్మలమ్మ గుడ్ న్యూస్? వాటిపై ట్యాక్స్ తగ్గింపు ?
At least 100 illegal miners die in an abandoned gold mine in South Africa.
According to Sabelo Mnguni, a representative of the United Group Against Illegal Mining, the miners trapped in the mine in North West Province are believed to have died from starvation or dehydration… pic.twitter.com/3LLzCbEchk
— SD (@stringerukraine) January 13, 2025
అయితే మరో 500 మంది ఇంకా భూగర్భంలోనే ఉన్నట్టు భావిస్తుండగా అందులో అనేకమంది ఆకలి అనారోగ్యంతో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే గనిలోకి వెళ్లేందుకు వచ్చిన తాళ్లు కప్పి వ్యవస్థను పోలీసులు తొలగించడం వల్లే బయటకు రాలేకపోతున్నారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఆకలితో ఎంతో మంది చనిపోతున్నారని చెబుతున్నారు. బయటకు రావడం లేదని పేర్కొంటున్నారు. ఏదేమైనా గతంలోనే ఇటువంటి రెస్య్కూ ఆపరేషన్ చేయబడితే ఎవరు ప్రాణాలు కోల్పోయేవారు కాదని ఇప్పటికైనా సహాయక చర్యలు చేపట్టడం ఊరట కలిగించే విషయమని స్వచ్ఛత సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.