Truth Social: ట్రంప్ సొంత సోషల్​ మీడియా యాప్​ వచ్చేస్తోంది.. విడుదల తేదీ ఇదే..!

Truth Social: సామాజిక మధ్యమాల నుంచి బ్యాన్​ ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ సొంత సోషల్ మీడియా యాప్ లాంచింగ్​కు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 10:40 PM IST
  • ట్రంప్ సొంత సోషల్ మీడియా యాప్ విడుదలకు రెడీ
  • ట్రూత్​ సోషల్​ పేరుతో అందుబాటులోకి
  • ట్రంప్ తొలి పోస్ట్​ను ట్వీట్​ చేసిన కుమారుడు
Truth Social: ట్రంప్ సొంత సోషల్​ మీడియా యాప్​ వచ్చేస్తోంది.. విడుదల తేదీ ఇదే..!

Truth Social: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు చెందిన సొంత సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​ త్వరలోనే అందుబాటులోకి రానుంది. 'ట్రూత్​ సోషల్' పేరుతో తీసుకొస్తున్న.. ఈ యాప్​ విడుదలకు సిద్ధమైనట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్​ పేర్కొంది.

ఫిబ్రవరి 21న (సోమవారం) యాపిల్ యాప్​ స్టోర్​లో.. ట్రూత్​ సోషల్​ యాప్​ అందుబాటులో ఉంటుందని రాయిటర్స్ వెల్లడించింది.

ట్రూత్​  సోషల్​ యాప్​.. గత ఏడాది అక్టోబర్​లో ఏర్పాటు చేసిన ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్​ ఆధ్వర్యంలో పని చేయనుంది.

ఇటీవల సంస్థ నెట్​వర్క్​ చీఫ్ ప్రోడక్ట్​ ఆఫీసర్​.. బిల్లి బి.. వరసగా పోస్టులు పెట్టినట్లు పేర్కొంది రాయిటర్స్​. ఇందులో ఓ టెస్టింగ్ యూజర్ యాప్ ఎప్పుడు విడుదల చేయనున్నారని ప్రశ్నించగా.. ఫిబ్రవరి 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారని తెలిసింది.

ఇక అంతకు ముందు.. ఫిబ్రవరి 16న.. ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్​ జూనియర్​.. కూడా ట్రూత్​ సోషల్​ యాప్​లో.. ట్రంప్ అధికారిక ఖాతాకు సంబంధించిన ఓ ఫొటోను ట్విట్టర్​లో షేర్ చేశారు. అందులో బ్రేకింగ్​..ట్రూత్​ సోషల్​లో డొనాల్డ్ ట్రంప్ మొదటి పోస్ట్​ అంటూ ఉంది.

ఈ స్కీన్​షాట్​ షేర్​ చేసిన డొనాల్డ్  ట్రంప్ జూనియర్​.. కూడా టైమ్​ ఫర్ ట్రూత్​ అంటూ ఈ ట్వీట్​ చేశారు

ఇక ఆ పోస్ట్​లో డొనాల్డ్​ ట్రంప్​.. మీ ఫేవరెట్ ప్రెసిడెంట్​ త్వరలోనే మిమ్మల్ని కలుసుకోనున్నారు అని రాసి ఉంది.

సొంత సోషల్ మీడియా ఎందుకు?

2021 జనవరి 6న అమెరికాలోని క్యాపిటల్ భవనంపై దాడి జరగింది. అయితే సామాజిక మాధ్యమాల్లో ట్రంప్ పెట్టిన పోస్ట్​ దాడులకు ఉసిగొలిపినట్లు ఉందని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్, సహా ఫేస్​బుక్​, యూట్యూబ్​ ట్రంప్ ఖాతాలను బ్యాన్ చేశాయి.

దీనితో గత కొంతకాలంగా ట్రంప్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఆయన ఖాతాలపై బ్యాన్​ను ఎత్తివేయకపోవడంతో.. ట్రంప్ సొంత సోషల్ మీడియాను నెలకొల్పాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అనుకున్నట్లుగానే ఆ దిశగా వడివడిగా అడుగుల పడ్డాయి. ఇప్పుడు ట్రంప్ సొంత సోషల్ మిడియా యాప్ విడుదలకు సిద్ధమైంది కూడా! యాప్, పోర్టల్ విడుదలైన తర్వాతే ఫీచర్లు సహా ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.

Also read: Queen Elizabeth II: బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌-2కు కరోనా పాజిటివ్

Also read: Russia-Ukraine Conflict: ఉక్రెయిన్‌లోని భారతీయులకు అలర్ట్.. ఆ దేశాన్ని వీడాలన్న భారత్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

 

 

 

Trending News