Beirut Port blast: 77000 అపార్ట్ మెంట్లు ధ్వంసం.. 200 మంది మరణం.. బీరుట్ పోర్ట్ పేలుడుపై రెండేళ్లైనా దొరకని క్లూ!

Beirut Blast: ఆగస్టు4.. ఈ తేదిగానే అనగానే లెబనాన్ దేశం ఉలిక్కి పడుతుంది. రెండేళ్ల క్రితం ఇదే రోజున బీరుట్ లో జరిగిన పేలుడు బీభత్సన్ని ఆ దేశ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఆగస్టు 4, 2020 సాయంత్రం  భారీ పేలుడుతో లెబనాన్ రాజధాని బీరుట్‌ వణికిపోయింది. నిమిషాల వ్యవధిలో జరిగిన రెండు పేలుళ్లలో 2 వందల మందికి పైగా చనిపోయారు.

Written by - Srisailam | Last Updated : Aug 4, 2022, 08:37 AM IST
  • బీరుట్ పోర్టు పేలుడుకు రెండేళ్లు
  • 77000 ఇళ్లు ధ్వంసం.. 200 మంది మరణం
  • పేలుడు కారణం కనిపెట్టని అధికారులు
Beirut Port blast: 77000 అపార్ట్ మెంట్లు ధ్వంసం.. 200 మంది మరణం.. బీరుట్ పోర్ట్ పేలుడుపై రెండేళ్లైనా దొరకని క్లూ!

Beirut Blast: ఆగస్టు4.. ఈ తేదిగానే అనగానే లెబనాన్ దేశం ఉలిక్కి పడుతుంది. రెండేళ్ల క్రితం ఇదే రోజున బీరుట్ లో జరిగిన పేలుడు బీభత్సన్ని ఆ దేశ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఆగస్టు 4, 2020 సాయంత్రం  భారీ పేలుడుతో లెబనాన్ రాజధాని బీరుట్‌ వణికిపోయింది. నిమిషాల వ్యవధిలో జరిగిన రెండు పేలుళ్లలో 2 వందల మందికి పైగా చనిపోయారు. 10 వేల మందికి పైగా గాయపడ్డారు. దాదాపు  77 వేల అపార్ట్ మెంట్లు పేలుడు ధాటికి ధ్వంసమయ్యాయి. నిమిషాల్లోనే బీరూట్‌ని శ్మశాన దిబ్బగా మార్చేసింది అమోనియం నైట్రేట్‌. దాదాపు మూడు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వీళ్లలో 80 వేల మంది చిన్నారులు ఉన్నారు.

 బీరుట్ పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాములో  ఈ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా వచ్చిన భారీ పేలుళ్లతో బీరుట్ జనం వణికిపోయారు. భయంతో రోడ్ల వెంట పరుగులు తీశారు. అమోనియం నైట్రేట్ పేలుడుకు తీవ్రతకు బీరుట్ పోర్టు మొత్తం
కకావికలం అయింది. పోర్టుకు రెండు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న షాపింగ్ మాల్‌లోనూ గాజు అద్దాలు ధ్వంసం అయ్యాయి. సుమారు 2750 ట‌న్నులు అమోనియం నైట్రేట్ ర‌సాయ‌నం పేల‌డం వ‌ల్ల బీరూట్‌లో బీభత్సం జరిగిందని అప్పుడు అంచనా వేశారు. బీరుట్ పోర్టులో పేలుడు జరిగిన రెండేళ్లు అవుతున్నా... పేలుడు ఖచ్చితమైన కారణం మాత్రం ఇంకా తెలియలేదు. బీరూట్  పోర్టు గిడ్డంగిలో అమ్మోనియం నైట్రేట్ నిల్వ కారణంగా సంభవించిన శక్తివంతమైన పేలుడుపై అంతర్జాతీయ దర్యాప్తు కోసం మానవ హక్కుల నిపుణులు రెండేళ్లుగా పిలుపునిస్తూనే ఉన్నారు. అయినా నిపుణులు కూడా ఇంతవరకు ఎలాంటి పురోగతి సాధించలేదు.

బీరుట్ విషాదం ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద అణు రహిత పేలుళ్లలో ఒకటి.. అయినా పేలుడు ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ప్రపంచం ఏమీ చేయలేదని మానవ హక్కుల సంఘం చెబుతోంది.పేలుడు జరిగిన రెండేళ్లు అవుతున్నా బాధితులు ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తుండటం దారుణమంటున్నారు. 2020, ఆగస్టు4న  పేలుడు జరిగిన కొద్దిసేపటికే  UN మానవ హక్కుల నిపుణులు స్పాట్ కు వెళ్లారు. పేలుడు బాధితులకు అండగా నిలిచారు. పేలుడు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని లెబనాన్ సర్కార్ ను కోరారు. అంతర్జాతీయ సమాజాన్ని అభ్యర్థించారు. అయినా ఎలాంటి విచారణ జరగలేదు.  జాతీయ దర్యాప్తు ప్రక్రియను చాలాసార్లు అడ్డుకున్నారని నిపుణులు చెబుతున్నారు. దర్యాప్తు సంస్థలకు సరైన వివరాలు లెబనాన్ అధికారులు ఇవ్వలేదనే విమర్శలు వస్తున్నాయి. బీరుట్ పేలుడపై స్వతంత్ర దర్యాప్తును ఏర్పాటు చేయాలని బాధిత కుటుంబాలు అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. పేలుడు మరియు దాని పర్యవసానాలు లెబనాన్‌లో నిర్లక్ష్య పాలన మరియు పాలకుల అవినీతికి సాక్ష్యంగా నిలుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇటీవల లెబనాన్‌ను సందర్శించిన హక్కుల నిపుణులు పేలుడుకు సంబంధించిన కారణాలను ఇంకా గుర్తించలేదని తెలుసుకుని షాకయ్యారు. పేలుడు ప్రభావిత ప్రాంతాలు శిథిలావస్థలో ఉన్నాయని.. వాటి పునరుద్దరణకు లెబనాన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బాధితులకు ఎలాంటి సాయం అందలేదని గుర్తించారు. లెబనాన్ లో ప్రస్తుతం తీవ్ర సంక్షోభం ఉంది. ఆహార కొరత వెంటాడుతోంది. లెబనాన్ తన ఆహారాన్ని 80 శాతం వరకు దిగుమతి చేసుకుంటుంది. బీరుట్ పేలుడు కారణంగా దేశం యొక్క ప్రధాన ఆహార వనరులైన  ధాన్యం ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. ఇంధనం, విద్యుత్తు, ఔషధం కొరత ఏర్పడింది. స్వచ్ఛమైన నీటిని పొందేందుకు లెబనాన్ ప్రజలు శ్రమిస్తున్నారు. బీరుట్ పేలుడు తర్వాత గత రెండేళ్లలో  లెబనాన్ కరెన్సీ విలువలో 95 శాతానికి పైగా పతనమైంది. గత జూన్‌లో ఆ దేశ సగటు ద్రవ్యోల్బణం రేటు 210 శాతంగా ఉంది. బీరుట్ పేలుడు తర్వాత లెబనాన్‌లోని ప్రజలకు సహాయం చేస్తామని కొన్ని దేశాలు ప్రకటించాయి. కాని బాధితులకు మాత్రం ఎలాంటి సాయం అందలేదని మానవ హక్కుల సంఘం ప్రతినిధులు గుర్తించారు. మొత్తం లెబనాన్ దేశ పతనానికి కారణమైన బీరుట్ పోర్టు పేలుడుకు ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియకపోవడం మాత్రం విస్మయపరుస్తోంది.

Read also: Rajgopal Reddy: రాజగోపాల్ రెడ్డికి కేసీఆర్ మంత్రిపదవి ఆఫర్? రాయబారం నడిపింది ఎవరు?

Trending News