Three snow leopards die of COVID-19: కరోనా మనుషులనే కాదు..జంతువులను సైతం వదలట్లేదు. తాజాగా కొవిడ్(COVID-19)తో మూడు మంచు చిరుతలు(snow leopards) మృతి చెందాయి. ఈ ఘటన అమెరికాలోని నెబ్రస్కా లింకన్ చిల్డ్రన్ జూ పార్కు(Nebraska Lincoln Children's Zoo)లో జరిగింది. ఈ మేరకు జూ నిర్వాహకులు అధికారిక ఫేస్బుక్ పేజీలో వెల్లడించారు.
గత నెలలో రెండు సింహాలకు, మూడు మంచు చిరుతలకు (snow leoprd died of corona) కరోనా సోకింది. చికిత్సలో సింహాలు కోలుకున్నాయి. కానీ చిరుతలు వైరస్ ప్రభావం నుంచి బయటపడలేకపోయాయని 'జూ' యాజమాన్యం వెల్లడించింది.
Also Read: Puneeth Raj Kumar: అటవీ అధికారుల అభిమానం...ఏనుగుకు పునీత్ రాజ్‌కుమార్ పేరు!
మనుషుల నుంచి జంతువులకు కరోనా వైరస్(CoronaVirus) వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా పర్యటకులను అనుమతించినట్లు వెల్లడించారు. అమెరికా(America)లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ఈ క్రమంలో పలు 'జూ'లు కూడా వైరస్ బెడదను ఎదుర్కొంటున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook