Moderna vaccine update: మోడెర్నా వ్యాక్సిన్‌తో జత కట్టేందుకు టాటా సంస్థ ప్రయత్నాలు

Moderna vaccine update: ఇండియన్ మార్కెట్‌లో మరో ప్రముఖ వ్యాక్సిన్ బ్రాండ్ రానుంది. మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్‌తో టాటా హెల్త్‌కేర్ జట్టు కట్టేందుకు చర్చలు ప్రారంభమయ్యాయి. 

Last Updated : Jan 25, 2021, 11:22 PM IST
Moderna vaccine update:  మోడెర్నా వ్యాక్సిన్‌తో జత కట్టేందుకు టాటా సంస్థ ప్రయత్నాలు

Moderna vaccine update: ఇండియన్ మార్కెట్‌లో మరో ప్రముఖ వ్యాక్సిన్ బ్రాండ్ రానుంది. మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్‌తో టాటా హెల్త్‌కేర్ జట్టు కట్టేందుకు చర్చలు ప్రారంభమయ్యాయి. 

భారతదేశంలో ప్రస్తుతం రెండు వ్యాక్సిన్ బ్రాండ్లతో వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా ( Oxford-Astrazeneca ) కంపెనీకు చెందిన కోవిషీల్డ్ ( Covishield ), స్వదేశీ వ్యాక్సిన్ కోవ్యాగ్జిన్ ( Covaxin ) ‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మరో ప్రముఖ కంపెనీ మోడెర్నా వ్యాక్సిన్ ( Moderna vaccine )‌ను ఇండియన్ మార్కెట్లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ కంపెనీ టాటా గ్రూప్ ( Tata Group ) ‌కు చెందిన హెల్త్‌కేర్ వెంచర్ ..మోడెర్నా కంపెనీతో భాగస్వామ్యం కోసం చర్చలు ప్రారంభమయ్యాయి. టాటా మెడికల్ డయాగ్నోస్టిక్స్, మోడెర్నా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి భారతదేశ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌తో జతకట్టినట్టు అధికారులు తెలిపారు.

ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్‌ ( Pfizer vaccine )‌ను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపర్చాలి. మోడెర్నా వ్యాక్సిన్‌ ( Moderna vaccine ) ను మాత్రం సాధారణ ఫ్రిజ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయవచ్చు. ఒకవేళ మోడెర్నా వ్యాక్సిన్‌ను ఇండియాలో తీసుకురావాలంటే స్థానికంగా పరీక్షలు జరపాల్సి వస్తుంది. మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్ చివరి దశలో 94.1 శాతం మందికి ఎలాంటి తీవ్రమైన భద్రతా సమస్యలు తలెత్తకపోవడంతో, వ్యాక్సిన్ వినియోగానికి యూఎస్, యూరప్‌లలో ఆమోదించారు. 

Also read: Impeachment on Trump: గద్దె దిగినా..అభిశంసన తప్పేట్టు లేదు డోనాల్డ్ ట్రంప్‌కు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News