Swiss Bank: స్విస్ బ్యాంకు ఖాతా ఇక గోప్యం కాదు, మూడోసారి వివరాలు అందుకున్న ఇండియా

Swiss Bank: స్విస్ బ్యాంకు నుంచి ఇండియన్స్ ఖాతా వివరాలు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి అందాయి. ఇండియా, స్విట్జర్లాండ్ దేశాల మధ్య కుదిరిన ఆ ఒప్పందం కారణంగా ఇక స్విస్ బ్యాంక్ ఖాతా గోప్యం కాదని తెలుస్తోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 11, 2021, 09:56 PM IST
  • స్విస్ బ్యాంకులో ఖాతా ఇకపై గోప్యం కానే కాదు
  • వరుసగా మూడోసారి భారతీయుల స్విస్ బ్యాంక్ ఖాతా వివరాల్ని అందుకున్న ఇండియా
  • ఇండియా స్విట్జర్లాండ్ మద్య కుదిరిన సమాచార మార్పిడి ఒప్పందం
Swiss Bank: స్విస్ బ్యాంకు ఖాతా ఇక గోప్యం కాదు, మూడోసారి వివరాలు అందుకున్న ఇండియా

Swiss Bank: స్విస్ బ్యాంకు నుంచి ఇండియన్స్ ఖాతా వివరాలు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి అందాయి. ఇండియా, స్విట్జర్లాండ్ దేశాల మధ్య కుదిరిన ఆ ఒప్పందం కారణంగా ఇక స్విస్ బ్యాంక్ ఖాతా గోప్యం కాదని తెలుస్తోంది. 

స్విట్జర్లాండ్‌లోని స్విస్ బ్యాంక్(Swiss Bank) అంటే బ్లాక్‌మనీకు కేరాఫ్‌గా నిలిచేది. కారణం ఈ బ్యాంకులో ఎక్కౌంట్ వివరాల్ని బహిర్గతం చేయరు. ఎవరికి ఎక్కౌంట్ ఉందనేది కూడా తెలియదు. అందుకే బ్లాక్‌మనీకు పర్యాయపదంగా స్విస్ బ్యాంకును పిలిచే పరిస్థితి. అయితే ఆటోమేటిక్ ఎక్స్చైంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒప్పందం ప్రకారం గోప్యతకు మారుపేరైన స్విస్ బ్యాంకులోని బ్లాక్‌మనీ(Black Money Details) వివరాలు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఖాతా సంఖ్య, ఖాతాదారుడి పేరు, చిరునామా, పుట్టిన తేదీ, పాన్‌నెంబర్, వడ్డీ, డివిడెండ్, భీమా పాలసీ చెల్లింపులు, క్రెడిట్ బ్యాలెన్స్, ఆస్థుల విక్రయం నుంచి వచ్చిన ఆదాయం వంటి అన్ని వివరాల్ని పరస్పరం మార్చుకోవచ్చు.

స్విట్జర్లాండ్ (Switzerland)ఇప్పటి వరకూ 96 దేశాలతో దాదాపు 33 లక్షల ఖాతాదారుల వివరాల్ని పంచుకున్నట్టు తెలుస్తోంది. సమాచార మార్పిడిని వరుసగా ఇండియా మూడోసారి అందుకుంది. స్విస్ ఆర్ధిక బ్యాంకులో ఖాతాలున్న పెద్ద వ్యక్తులు, కంపెనీల వివరాలు ఇండియాకు అందాయి. ఈ మార్పిడి సెప్టెంబర్ నెలలో జరిగింది. తదుపరి సమాచార మార్పిడి 2022 సెప్టెంబర్‌లో ఉంటుంది. 2019 సెప్టెంబర్ నెలలో తొలిసారిగా ఇండియా.. స్విట్జర్లాండ్ నుంచి సమాచారాన్ని అందుకుంది. రెండు దేశాల మధ్య ఈ ఒప్పంద కుదిరినప్పటి నుంచి స్విస్ బ్యాంకుల్లో అక్రమ డిపాజిట్లను చాలామంది భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలించేశారని సమాచారం. 

Also read: Nobel Prize for Ecomomics 2021: కార్డ్‌, ఆంగ్రిస్ట్‌, ఇంబెన్స్‌లకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News