Sudan Violence News: సుడాన్‌లో హింసాత్మక పరిస్థితులు.. భారతీయుల సేఫ్టీపై స్పందించిన భారత్

Sudan Violence News: సుడాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై గురువారం మీడియాతో మాట్లాడిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం భగ్చి.. సుడాన్ క్లిష్ట పరిస్థితులపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

Written by - Pavan | Last Updated : Apr 20, 2023, 11:12 PM IST
Sudan Violence News: సుడాన్‌లో హింసాత్మక పరిస్థితులు.. భారతీయుల సేఫ్టీపై స్పందించిన భారత్

Sudan Violence News: ఆఫ్రికాలోని సుడాన్ దేశంలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. సుడాన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడి భారతీయుల రక్షణపై భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. సుడాన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ అక్కడ ఉన్న భారతీయుల సంరక్షణకే భారత ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోంది అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం భగ్చి తెలిపారు. సుడాన్ తో పాటు ఆఫ్రికాలోని సుడాన్ పొరుగు దేశాలతోనూ భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టు అరిందం భగ్చి పేర్కొన్నారు. 

సుడాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై గురువారం మీడియాతో మాట్లాడిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం భగ్చి.. సుడాన్ క్లిష్ట పరిస్థితులపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కూడా న్యూయార్క్‌లో ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ని కలిసి సుడాన్‌లో పరిస్థితులపై చర్చించనున్నట్టు అరిందం భగ్చి  స్పష్టంచేశారు. సుడాన్ లో ఉన్న భారతీయులను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తారా అని అడిగిన ప్రశ్నకు అరిందం భగ్చి స్పందిస్తూ.. ఇప్పటికే సుడాన్ పొరుగు దేశాలతో చర్చిస్తున్నామని.. ఏదేమైనా సుడాన్ లో ఉన్న పరిస్థితులపైనే తమ నిర్ణయం ఆధారపడి ఉంటుంది అని అన్నారు.

భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం ఈజిప్ట్ విదేశాంగ శాఖ మంత్రి సమే శౌక్రితోనూ సుడాన్ గురించి చర్చించారు. భారత్ కి అన్నివిధాల సహకరిస్తామని సమె హామీ ఇచ్చారని అరిందం భగ్చి తెలిపారు. సుడాన్‌లో నెలకొన్న పరిస్థితులపై గత 24 గంటల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ శాఖ మంత్రి షేక్ అబ్ధుల్లా బిన్ జయేద్ అల్ నయన్‌తో పాటు సౌది అరేబియా విదేశాంగ శాఖ మంత్రితోనూ  కేంద్రమంత్రి జైశంకర్ ఫోన్‌లో మాట్లాడారని.. అందులో భాగంగానే ఈజిప్టుకి చెందిన సమెతోనూ మాట్లాడారని భగ్చి స్పష్టంచేశారు. 

సుడాన్‌లో అధికారం కోసం జరుగుతున్న సివిల్ వార్‌లో 250 మందికిపైగా మృతి చెందగా మరో 2500 మందికిపైగా జనం గాయపడ్డారు. రెగ్యులర్ ఆర్మీకి, మెయిల్ మిలిటరీ ఫోర్స్ అయిన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌కి మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధంలో సాధారణ పౌరులు ప్రాణాలు అరచేత పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. సుడాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదిరినట్టయితే, రష్యా -  ఉక్రెయిన్ మధ్య వార్ సమయంలో అవలంభించిన విధానాల తరహాలోనే సుడాన్‌లో ఉన్న భారతీయులను కూడా భారత్ కి రప్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Trending News