రష్యాలో కరోనా కల్లోలం...రికార్డు స్థాయిలో మరణాలు!

రష్యాను కరోనా వణికిస్తోంది. కొవిడ్ మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వైరస్ తో శనివారం 1,254 మంది మృతి చెందారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2021, 08:47 PM IST
రష్యాలో కరోనా కల్లోలం...రికార్డు స్థాయిలో మరణాలు!

Russia Covid Deaths: రష్యా(Russia)లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వరుసగా నాలుగో రోజూ కొవిడ్‌ మృతుల(COVID deaths) సంఖ్య 1200లకు పైగా నమోదైంది. దేశంలో బుధవారం 1247 మంది కొవిడ్‌(COVID-19)తో మృత్యువాత పడగా.. గురువారం 1251, శుక్రవారం 1254 మంది చొప్పున మరణించారు. అలాగే, శనివారం కూడా 1254మంది కరోనా కాటుకు బలికాగా.. 37,120మందికి ఈ మహమ్మారి సోకినట్టు రష్యా కరోనా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు(Corona virus task force) వెల్లడించారు. గత కొన్ని వారాలుగా కొవిడ్‌ ఉద్ధృతి తగ్గినట్టు కనబడినప్పటికీ.. గతంలో కన్నా అధికంగా కేసులు, మరణాలు నమోదుకావడం విశేషం. 

Also read: గర్భిణీలపై డెల్టా వేరియంట్ ప్రభావం.. గర్భస్థ శిశువులకు ముప్పు

వ్యాక్సినేషన్‌ రేటు(Vaccination Rate) మందగించడం, కొవిడ్‌ నిబంధనలు పాటించడంలో ప్రజలు అలసత్వ ధోరణిని ప్రదర్శించడమే తాజాగా ఈ మహమ్మారి పెరుగుదలకు కారణమని నిపుణులు భావిస్తున్నారు.  ప్రపంచంలో తొలిసారి రష్యాలోనే కరోనా టీకా(Corona Vaccine) అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఇప్పటిదాకా కేవలం 40శాతం మందికి మాత్రమే పూర్తిస్థాయిలో టీకా మోతాదులు అందాయి. రష్యాలో ఇప్పటివరకు 9.3మిలియన్లకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. 2,62,843మంది ప్రాణాలు కోల్పోయినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. వాస్తవంగా ఈ సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంటుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. యూరప్‌ దేశాలతో పోలిస్తే రష్యాలోనే కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News