Russian flight crashed: సముద్రంలో కూలిన రష్యా విమానం

Russian flight crashed into sea: మాస్కో: రష్యా విమానం రష్యాకు తూర్పున ఉన్న సముద్రంలో కూలిపోయిన ఘటన కొద్దిసేపటి క్రితం చోటుచేసుకుంది. 28 మందితో ఉన్న విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించే క్రమంలోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానం కూలిపోయిన చోటుకు పలు నౌకలు బయల్దేరాయని అత్యవసర సేవల విభాగం వెల్లడించినట్టుగా ఆర్ఐఏ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 6, 2021, 04:04 PM IST
Russian flight crashed: సముద్రంలో కూలిన రష్యా విమానం

Russian flight crashed into sea: మాస్కో: రష్యా విమానం రష్యాకు తూర్పున ఉన్న సముద్రంలో కూలిపోయిన ఘటన కొద్దిసేపటి క్రితం చోటుచేసుకుంది. 28 మందితో ఉన్న విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించే క్రమంలోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. తొలుత విమానం ఆచూకీ గల్లంతయినట్టు వార్తలొచ్చినప్పటికీ.. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే విమానం రష్యాకు తూర్పున ఉన్న సముద్రంలో కూలిపోయినట్టు ఆర్ఐఏ న్యూస్ ఏజెన్సీ (RIA news agency) వెల్లడించింది. 

అంటోనొవ్ ఎఎన్-26 (Antonov An-26) ట్విన్ ఇంజిన్ టర్బోప్రొపెల్లర్ విమానం పెట్రోపవ్‌లవ్‌స్క్-కంచటస్కీ నుంచి ఉత్తర కంచటస్కీలోని పలనకు (Petropavlovsk-Kamchatsky to Palana) వెళ్తుండగా విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయినట్టు రష్యా అత్యవసర శాఖ ప్రకటించింది.

Also read: Indians Travel Ban: ఇండియా ప్యాసింజర్స్‌పై ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత, మరికొన్ని దేశాలకు ఊరట

విమానం కూలిపోయిన చోటుకు పలు నౌకలు బయల్దేరాయని అత్యవసర సేవల విభాగం వెల్లడించినట్టుగా ఆర్ఐఏ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. విమానం కూలిపోయిన సమయంలో విమానంలో 22 మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. కూలిపోయిన విమానంలో (Flight crashed) ఉన్న ప్రయాణికులలో పలన మేయర్ ఓల్గా మొఖిరెవా కూడా ఉన్నట్టు ఆర్ఐఏ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

Also read : Delta Variant: ప్రమాదకరంగా మారుతున్న డెల్టా వేరియంట్, WHO ఆందోళన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News