Dollar Vs Rupee: డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతోంది. అంతర్జాతీయ పరిణామాలతో డాలర్‌తో రూపాయి పోటీ పడలేకపోతోంది. నేడు రూపాయి 11 పైసలు నష్టపోయి రూ.78.96 వద్ద స్థిరపడింది. ఈఏడాది గరిష్ఠ స్థాయి నుంచి రూపాయి 6 శాతం క్షీణించింది. రూపాయిపై డాలర్ చాలా ప్రభావం చూపుతోంది. ఈఏడాది డాలర్ ఇండెక్స్ 8 శాతం కంటే ఎక్కువ లాభపడింది. మరోవైపు యూఎస్(US) వడ్డీ రేట్లు పెరగడంతో డాలర్ బలపడేందుకు ఊతమిస్తోంది.
ఐతే గతకొంతకాలంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ దారుణంగా ఉంది. ఈఏడాది జనవరి 12న డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.73.77గా ఉంటే..మేలో రూ.4 తగ్గి రూ.77.72కి చేరింది. ఐతే ఏప్రిల్‌లో డాలర్‌తో పోలిస్తే రూ.75.23కి చేరింది. అదే నెలలో 5 నుంచి పతన మొదలైంది. ఇప్పుడు ఆన్‌లైమ్ కనిష్ఠానికి చేరింది.
రూపాయి బలహీనతకు కారణాలు తెలుసుకుందాం..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, యూఎస్ ఫెడ్ ద్రవ్య విధానం, ప్రపంచ అనిశ్చితి, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కారణంగా డాలర్‌తో రూపాయి బలహీనపడుతోంది. వీటితోపాటు ముడి చమురు ధరలు పెరగడం, డాలర్ సాధారణ బలపడటం వంటివి రూపాయి పతనానికి కారణమయ్యాయి. యూఎస్ ఫెడ్ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం వల్ల ప్రజలు పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈఏడాది మే 16 నాటికి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు భారత్ నుంచి 21.2 బిలియన్ల డాలర్లను ఉపసంహరించుకున్నారు. దీంతో రూపాయి, విదేశీ మారకద్రవ్య నిల్వలపై ప్రభావం పడింది.
రూపాయి క్షీణత ప్రభావం..
రూపాయి పతనంతో దేశంలో దిగుమతులు ఖరీదైనవిగా మారుతున్నాయి. ద్రవ్యోల్బణం సైతం పెరుగుతోంది. పలు రంగాలపై ప్రభావం చూపుతోంది. ముడి చమురును విదేశాల నుంచి భారత్ అధిక స్థాయిలో దిగుమతి చేసుకుంటోంది. దిగుమతులపై రూపాయి క్షీణత ప్రభావం అధికంగా పడుతోంది. దీంతో దిగుమతులు చేసుందుకు భారీగా ఖర్చు అవుతోంది.
రూపాయి క్షీణత ఎవరికీ లాభం..?
రూపాయి క్షీణత కొన్ని రంగాలకు నష్టాలను చేకూర్చుతే..మరికొన్ని రంగాలకు లాభాలు వస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఎగుమతి ఆధారిత ఐటీ, ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్ వంటి ఎగుమతి ఆధారిత రంగాలకు విజయం చేకూరుతోంది. ప్రధానంగా రత్నాలు, ఆభరణాలు, పెట్రోలియం ఉత్పత్తులు, సేంద్రీయ రసాయనాలు, ఆటో మొబైల్, యంత్రాల వస్తువులను భారత్ గణనీయంగా దిగుమతులు చేసుకుంటోంది. రూపాయి క్షీణతతో ఆ వస్తువుల ధరలు అమాతంగా పెరుగుతున్నాయి. ఐటీ, కార్మిక ఆధారిత వస్త్రాలు, పరిశ్రమలకు రూపాయి క్షీణత ప్రయోజనాలు కల్గుతాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
Also read: Sapota Benefits: సపోటా పండ్లను వీరు అస్సలు తినకూడదు.. తింటే ఈ దుష్ప్రభావాలు తప్పవు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి