Portuguese Nurse Dies After Getting Pfizer-BioNTech Covid Vaccine: కరోనా వ్యాక్సిన్లు ఆమోదం పొందుతున్నాయని, తర్వలోనే మహమ్మారి నుంచి బయటపడతామని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న ఓ నర్సు హఠాన్మరణం చెందారు. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల్లో నర్సు చనిపోయినట్లు సమాచారం.
ఎన్నో ప్రమాణాలతో తయారుచేసిన వ్యాక్సిన్లు వికటిస్తున్నాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సోనియా ఏస్‌వెడో అనే 41ఏళ్ల పోర్చుగీసు నర్సు నూతన సంవత్సరం తొలిరోజు అకస్మాత్తుగా చనిపోయింది. అంతకు 48 గంటల ముందు ఫైజర్ బయోఎన్‌టెక్ కరోనా టీకా(Pfizer Vaccine)ను ఆమె తీసుకున్నారు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న నర్సు చనిపోవడంతో వ్యాక్సిన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.
Also Read: Covishield vaccine price: వ్యాక్సిన్ డోసు ఒక్కటీ..వేయి రూపాయలు
పోర్టోలోని పోర్చుగీసు ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ ఆంకాలజీ డిపార్ట్‌మమెంట్‌లో సోనియా విధులు నిర్వహించేవారు. ఆమెకు సంతానం ఇద్దరు పిల్లలు ఉన్నారు. హెల్త్ వర్కర్ అయిన సోనియా డిసెంబర్ 30న ఫైజర్ బయోఎన్‌టెక్ కరోనా టీకా(Corona Vaccine) తీసుకున్నారు. తన తల్లి మరణంపై కారణాలు తెలియాలంటూ చనిపోయిన నర్సు సోనియా కుమార్తె అబిలియో ఏస్‌వెడో ఉన్నతాధికారులను కోరారు. విచారణ జరిపించి నిజనిజాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు.
Also Read: Cloves Benefits: లవంగాలు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?
తమ వద్ద పనిచేస్తున్న నర్సు సోనియా చనిపోవడంపై పోర్చుగీసు ఇన్‌స్టిస్ట్యూట్ ఆఫ్ ఆంకాలజీ డిపార్ట్‌మమెంట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సోనియా ఆరోగ్యంగానే ఉండేదని, హఠాన్మరణం తమను కలచివేస్తుందని తోటి ఉద్యోగులు చెబుతున్నారు. మరోవైపు పోర్చుగీసు అధికారులు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం సోనియా అకాల మరణంపై దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే ఆమె మరణానికి కారణాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.
Also Read: 5 Health Mistakes: 2021 నుంచి ఈ తప్పులు అసలు చేయవద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
షాకింగ్.. Pfizer Vaccine తీసుకున్న నర్సు హఠాన్మరణం
ఫైజర్ బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ తీసుకున్న నర్సు హఠాన్మరణం..
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 48 గంటల్లో మహిళా నర్సు మరణం
పోర్చుగల్ నర్సు మరణంపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు