Pakistan earthquake: పాకిస్థాన్‌లో భూకంపం.. 20 మంది మృతి

Death toll in Pakistan earthquake: పాకిస్తాన్‌లో భూకంపంపై (Earthquake in Pakistan) పాకిస్తాన్ ప్రావిన్షియల్ ఇంటీరియర్ మినిస్టర్ మిర్ జియా ఉల్లా స్పందిస్తూ.. భూకంపం కారణంగా ఇప్పటివరకు 20 మంది వరకు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం అందుతోందని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని మిర్ జియా తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2021, 11:19 AM IST
Pakistan earthquake: పాకిస్థాన్‌లో భూకంపం.. 20 మంది మృతి

Death toll in Pakistan earthquake: క్వెట్టా: పాకిస్థాన్‌లో గురువారం తెల్లవారిజామున భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 5.7 మ్యాగ్నిట్యూడ్‌‌గా నమోదైంది. ఈ భూకంపంలో 20 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తోంది. పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. తెల్లవారిజామున అందరూ నిద్రిస్తుండగా జరిగిన భూకంపం కావడం వల్లే మృతుల సంఖ్య అధికంగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. దక్షిణ పాకిస్థాన్‌లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లో క్వెట్టాకు సమీపంలో భూకంపం సంభవించింది. 

భూకంపం కారణంగా పర్వతశ్రేణుల్లోని హర్నాయి పట్టణంలో విద్యుత్ స్థంబాలు కూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే మొబైల్ నెట్‌వర్క్ సైతం నిలిచిపోయింది. దీంతో క్షతగాత్రులకు చీకట్లో టార్చ్ లైట్ల వెలుతురులో చికిత్స అందించాల్సి వచ్చిందని అక్కడి అధికారులు తెలిపారు. మొబైల్ నెట్‌వర్క్ (Mobile network) నిలిచిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని మరో అధికారి పేర్కొన్నారు. 

పాకిస్తాన్‌లో భూకంపంపై (Earthquake in Pakistan) పాకిస్తాన్ ప్రావిన్షియల్ ఇంటీరియర్ మినిస్టర్ మిర్ జియా ఉల్లా స్పందిస్తూ.. భూకంపం కారణంగా ఇప్పటివరకు 20 మంది వరకు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం అందుతోందని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని మిర్ జియా తెలిపారు. 

Also read : Baby onboard: విమానంలోనే ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం, లండన్ నుంచి కేరళ వస్తున్న విమానంలో ఘటన

పాకిస్తాన్‌లో గురువారం తెల్లవారిజామున 3 గంటలకు సంభవించిన భూకంపం (Earthquake) తీవ్రత 3.5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే స్పష్టంచేసింది. 20 కిమీ లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

Also read : Nobel Prize in Chemistry: రసాయన శాస్త్రంలో బెంజమిన్‌ లిస్ట్‌, డేవిడ్ మెక్‌మిల్లన్‌లకు నోబెల్

Also read : Internet 2.0 Report: కరోనా కంటే ముందుగానే చైనా సన్నద్దమైందా, నివేదికలో ఏముంది

Also read : Haunted Place: ప్రపంచంలోనే అతి పెద్ద పిచ్చాసుపత్రి..ఇప్పుడొక దెయ్యాల శాలగా భయపెడుతోంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News