/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

OLX Group To Cut 1500 Jobs Globally: ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీలలో ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియ కొనసాగుతోంది. కంపెనీపై అదనపు భారాన్ని తొలగించుకుని.. నష్టాల నుంచి బయటపడేందుకే 'లే ఆఫ్' ప్రకటిస్తున్నాయి. తాజాగా ఆన్‌లైన్ ట్రేడింగ్ కంపెనీ 'ఓఎల్ఎక్స్' కూడా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా 1500 మందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఆన్‌లైన్‌లో సెకండ్‌ హ్యాండ్‌ వస్తువులను విక్రయించే వేదికగా ఓఎల్ఎక్స్‌ అందరికీ సుపరిచితమే.

ఓఎల్ఎక్స్‌లో 10 వేల మంది పని చేస్తుండగా.. 15 శాతం మందిని (1500 మంది) తొలగించేందుకు (OLX Layoffs 2023) చర్యలు చేపడుతోందట. 1500 మందిలో భారత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే ఎంత మందిని తొలగిస్తున్నారనే విషయం తెలియరాలేదు. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఈ తొలగింపులు చేపడుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిసింది. ఆర్థిక మాంద్యం కారణంగా ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ట్విటర్‌, స్విగ్గీ, గూగుల్, ఫిలిప్స్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే

ఓఎల్‌ఎక్స్‌ (OLX) తొలగింపు నిర్ణయంతో.. కంపెనీ ఆటో బిజినెస్‌పై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. ఇంజినీరింగ్‌, ఆపరేషన్స్‌ టీమ్‌లో పనిచేసే ఉద్యోగులపై కూడా తొలగింపుల ప్రభావం ఉండబోతోందట. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఓఎల్‌ఎక్స్‌ ఈ నిర్ణయం తీసుకుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. భవిష్యత్‌ ఆశయాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నట్లు చెప్పారు. 

ఓఎల్‌ఎక్స్‌ గ్రూప్‌ భారత్‌లో 2009లో ప్రారంభించారు. సెకండ్‌ హ్యాండ్‌ వస్తువులను విక్రయించే వేదికగా కొద్ది కాలంలోనే ప్రజలకు చేరువైంది. ప్రస్తుతం ఆన్‌లైన్ సెకండ్ హ్యాండ్ వస్తువుల విక్రయంలో అగ్ర స్థానంలో ఉంది. ఓఎల్‌ఎక్స్‌ కంపెనీ 2020 జనవరిలో ఓఎల్‌ఎక్స్‌ ఆటో పేరిట ప్రీ-ఓన్డ్‌ కార్స్‌ వ్యాపారాన్ని కూడా ప్రారంభించింది. 

Also Read: Prithvi Shaw vs Shubman Gill: వన్డేలకు గిల్‌.. టీ20లకు పృథ్వీ షా సరిగ్గా సరిపోతారు: మాజీ ఓపెనర్  

Also Read: Lucknow Pitch Curator: రెండో టీ20 మ్యాచ్‌పై భారత కెప్టెన్‌ అసహనం.. పిచ్‌ క్యురేటర్‌పై వేటు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Section: 
English Title: 
OLX Layoffs 2023: OLX to Lays Off 1500 Employees globally
News Source: 
Home Title: 

OLX Layoffs: ఓఎల్ఎక్స్‌లోనూ లే ఆఫ్.. 1500 మంది ఉద్యోగులపై వేటు! భారత్‌లో కూడా

OLX Layoffs: ఓఎల్ఎక్స్‌లోనూ లే ఆఫ్.. 1500 మంది ఉద్యోగులపై వేటు! భారత్‌లో కూడా
Caption: 
Source: File Photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఓఎల్ఎక్స్‌లోనూ లే ఆఫ్

1500 మంది ఉద్యోగులపై వేటు

భారత్‌లో ఉద్యోగులపై కూడా 
 

Mobile Title: 
OLX Layoffs: ఓఎల్ఎక్స్‌లోనూ లే ఆఫ్.. 1500 మంది ఉద్యోగులపై వేటు! భారత్‌లో కూడా
P Sampath Kumar
Publish Later: 
No
Publish At: 
Tuesday, January 31, 2023 - 17:19
Request Count: 
65
Is Breaking News: 
No