Kim Jong Un సంచలనం.. తప్పిదాన్ని ఒప్పుకున్న ఉత్తర కొరియా అధినేత

North Koreas Kim Jong Un Admits Mistakes As Party Opens Rare Congress: ప్రపంచ దేశాలలో విభిన్నంగా ప్రవర్తించే దేశాలు ఉత్తర కొరియా, చైనా. అందుకు వీరి మధ్య స్నేహం ఉంటుంది. అయితే తనకు నచ్చినట్లుగా ప్రతిదీ చేసుకుంటూ వెళ్లే నైజం ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సొంతం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2021, 04:17 PM IST
  • ప్రపంచ దేశాలలో విభిన్నంగా ప్రవర్తించే దేశాలు ఉత్తర కొరియా, చైనా
  • న్యూ ఇయర్ సందర్భంగా తొలిసారి దేశ ప్రజలను ఆశ్చర్యపరిచిన కిమ్
  • తాజాగా తమ తప్పిదం జరిగిందంటూ ఒప్పుకున్న కిమ్ జాంగ్ ఉన్
Kim Jong Un సంచలనం.. తప్పిదాన్ని ఒప్పుకున్న ఉత్తర కొరియా అధినేత

North Koreas Kim Jong Un Admits Mistakes As Party Opens Rare Congress: ప్రపంచ దేశాలలో విభిన్నంగా ప్రవర్తించే దేశాలు ఉత్తర కొరియా, చైనా. అందుకేనేమో ఈ దేశాల మధ్య స్నేహం ఉంటుంది. అయితే తనకు నచ్చినట్లుగా ప్రతిదీ చేసుకుంటూ వెళ్లే నైజం ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సొంతం. అయితే ఈ నూతన సంవత్సరం సందర్భంగా లేఖ రాసి దేశ ప్రజలను అధినేత కిమ్ ఆశ్చర్యానికి లోనుచేశాడు. ఇతర దేశాలకు సైతం అది చాలా కొత్తగా అనిపిస్తుంది.

తాజాగా కిమ్ జాంగ్ ఉన్ మరో కీలక ప్రకటన చేసి మరింత షాకిచ్చారు. తాము తప్పిదం చేశామని, తమ దేశ ఆర్థికాభివృద్ధి ప్రణాళిక విఫలమైందని ప్రకటించారు. ఇటీవల జరిగిన అధికార వర్కర్స్‌ పార్టీ సమావేశంలో కిమ్‌ జాంగ్ ఉన్ స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించారు. గత ఐదేళ్లలో తొలిసారి ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో అధినేత కిమ్ జాంగ్ ఉన్(Kim Jong Un) తమ ప్రణాళికలు విఫలయ్యాయంటూ తప్పిదాన్ని అంగీకరించి దేశ ప్రజలను మరోసారి ఆశ్చర్యానికి గురి చేశారు.

Also Read: విష ప్రయోగం చేశారంటూ ISRO Scientist Tapan Misra సంచలన ఆరోపణలు!

ఇప్పటివరకూ ఉత్తర కొరియా(North Korea) దేశ చరిత్రలో ఇలాంటి సమీక్షా సమావేశాలు 10 కూడా జరగకపోవడం గమనార్హం. అసలే కోవిడ్19 కేసులు లేని దేశం కనుక ఏ విధమైన నిబంధనలు పాటించకుండానే ప్రతినిధులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. తొలిసారిగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కిమ్ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లోనూ లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమయ్యామని అంగీకరించినట్లు సమాచారం. తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.

Also Read: షాకింగ్.. Pfizer Vaccine తీసుకున్న నర్సు హఠాన్మరణం

అగ్రరాజ్యం అమెరికా నుంచి సంబంధాలు కోరుకుంటున్న కారణంగానే నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఈ ప్రకటన చేశారని ప్రపంచ దేశాలు అభిప్రాయపడుతున్నాయి. కొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ గద్దెదిగడం, కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయన్నారని తెలసిందే. నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై డెమోక్రాటిక్ పార్టీకి చెందిన జో బైడెన్ ఘన విజయం సాధించారు.

Also Read: Banita Sandhu Photos: బాలీవుడ్ నటి బనితా సంధు లేటెస్ట్ ఫొటోస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News