Nirav Modi Extradition To India: పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 11 వేల కోట్ల మేర మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి నిరవ్ మోదీకి యుకే హై కోర్టులో చుక్కెదురైంది. భారత్ ను మోసం చేసి బ్రిటన్ కి పారిపోయిన నిరవ్ మోదీని తిరిగి అప్పగించాల్సిందిగా కోరుతూ బ్రిటన్ న్యాయస్థానంలో భారత్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేకసార్లు ఈ కేసు విచారణకు రాగా తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తనను తిరిగి భారత్‌కి అప్పగించకూడదని విజ్ఞప్తి చేస్తూ నిరవ్ మోదీ దాఖలు చేసిన పిటిషన్‌ని యుకే హై కోర్టు కొట్టిపారేసింది. దీంతో నిరవ్ మోదీని భారత్‌కి అప్పగించేందుకు మార్గం కొంత సుగుమం అయిందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
తరువాతేంటి ?
యూకే హైకోర్టు తీర్పుతో నిరవ్ మోదీని భారత్‌కి అప్పగించేందుకు మార్గం సుగుమమైనప్పటికీ.. మధ్యలో మరో రెండు దశలు దాటాల్సి ఉందని తెలుస్తోంది. అందులో ఒకటి నిరవ్ మోదీ బ్రిటన్ సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టయితే అక్కడ కూడా యూకే సుప్రీం కోర్టులో నిరవ్ మోదీని దోషిగా నిలబెట్టడంలో భారత్ సక్సెస్ అవ్వాల్సి ఉంటుంది. అయితే బ్రిటన్ చట్టాల ప్రకారం నిరవ్ మోదీ సుప్రీం కోర్టును ఆశ్రయించాలనుకున్నా.. అందుకు యూకే హై కోర్టు అనుమతి తప్పనిసరి కానుంది.
సుప్రీం కోర్టులో న్యాయపోరాటం కాకుండా నిరవ్ మోదీ బ్రిటన్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌ని సైతం ఆశ్రయించే మార్గం లేకపోలేదని తెలుస్తోంది. ఈ రెండు అడ్డంకులు ఎదురవకపోతే.. నిరవ్ మోదీని భారత్‌కి రప్పించడం ఇంకెంతో దూరంలో లేనట్టే అని భావించాల్సి ఉంటుంది. నిరవ్ మోదీని భారత్ కి రప్పించేందుకు బ్రిటన్ కోర్టులో న్యాయ పోరాటం చేస్తోన్న భారత్.. అతడిని ఇండియాకు తీసుకురాగానే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకి తరలించనున్నట్టు సమాచారం. ఈ జైలు నుంచే అతడు పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి బ్రిటన్‌కి పారిపోయిన కేసు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే కేసులో నిరవ్ మోదీతో పాటు అతడి సమీప బంధువు మోహుల్ చోక్సీ సైతం రెండో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
Also Read : America Elections: అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. జో బైడెన్‌కు అగ్నిపరీక్ష.. రంగంలోకి ట్రంప్
Also Read : PM Modi, PM Rishi Sunak: రిషి సునాక్‌కి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్
Also Read : Rishi Sunak to Kamala Harris: రిషి సునక్ ఒక్కడే కాదు.. విదేశాలను ఏలిన భారతీయుల జాబితా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook