/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

McDonald's Burger: ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ రష్యాలోని మొత్తం 850 రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేయబోతున్నట్లు ఇటీవలే ఆ కంపెనీ ప్రకటించింది. దీంతో రష్యాలోని ఫుడీస్.. చివరిసారి బర్గర్ రుచిని ఆస్వాదించేందుకు మెక్‌డొనాల్డ్స్ బయట ప్రజలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో రష్యాలోని మెక్‌డొనాల్డ్స్ అవుట్ లెట్స్ వద్ద ఉన్న పరిస్థితిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియోస్ తో పాటు ఫొటోలు వైరల్ గా మారాయి. 

ఒక నెల ఇంటి అద్దెకు సమానం..

'దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి' అనే సామెత మీరు వినే ఉంటారు. అంటే ఒక సమస్యను మీ సమస్యగా భావించే బదులు దాన్ని అవకాశంగా మార్చుకోవాలనేది దాని అర్థం. ఇప్పుడదే సామెతను రష్యాలోని కొన్ని ఫుడ్ అవుట్ లెట్స్, ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఒక నెల ఇంటి అద్దెకు సమానమైన విలువతో కొన్ని కంపెనీలు ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి. 

అయితే ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి తినేందుకు రష్యా ఫుడీస్ సిద్ధమయ్యారు. మూడు - నాలుగు మెక్‌డొనాల్డ్స్ బర్గర్ల కాంబోను రూ. 26,000 ధరకు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు విక్రయిస్తున్నాయి. ఈ డబ్బుతో మన దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లలో 3 BHK ఫ్లాట్ అద్దెకు తీసుకోవచ్చు. 

మెక్‌డొనాల్డ్స్ బర్గర్ కాంబోల ధరలు

మూడు లేదా నాలుగు బర్గర్ల కాంబో విలువ రూ. 26,000 గా ఉంది. కోకా కోలా సాఫ్ట్ డ్రింక్ ను రూ.1,000 ధరకు రష్యాలో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొన్ని కాంబోల విలువ రూ. 33,400 ధరకు విక్రయిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పిక్స్ ద్వారా తెలుస్తోంది. 

మెక్‌డొనాల్డ్స్ ప్రపంచంలోని ప్రముఖ ఫుడ్ అండ్ డ్రింక్స్ కంపెనీలలో ఒకటి. ఇటీవలే ఉక్రెయిన్ దేశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధాన్ని ప్రకటించాడు. దీంతో ప్రపంచ దేశాలన్నీ రష్యాపై ఆంక్షలను విధించాయి. దీంతో పాటు అమెరికన్ ఫుడ్ సంస్థలలో ఒకటైన మెక్‌డొనాల్డ్స్.. రష్యాలోని తమ ఫుడ్ అవుట్ లెట్స్ ను మూసేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించింది.  

Also Read: Omicron Lockdown: రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. ఆ నగరంలో మళ్లీ లాక్‌డౌన్! ఆసక్తికర విషయం ఏంటంటే?

Also Read: Petrol Price: వినియోగదారులకు భారీ షాక్.. లీటర్ పెట్రోల్ పై రూ.50, డీజిల్ పై రూ.75 పెంపు! ఆల్‌టైమ్ రికార్డు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
McDonalds Burger: after closure announcement in Russia McDonalds selling burgers online for Rs 26,000
News Source: 
Home Title: 

McDonald's Burger: మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌ ధర రూ.26,000.. పోటీపడి మరీ కొంటున్న ఫుడీస్!

McDonald's Burger: మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌ ధర రూ.26,000.. పోటీపడి మరీ కొంటున్న ఫుడీస్!
Caption: 
McDonalds Burger: after closure announcement in Russia McDonalds selling burgers online for Rs 26,000 | Zee Media
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
McDonald's Burger: మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌ ధర రూ.26,000- పోటీపడి మరీ కొంటున్న ఫుడీస్
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Saturday, March 12, 2022 - 13:00
Request Count: 
82
Is Breaking News: 
No