Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత

Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం నమోదైంది. భారీ భూకంపం కారణంగా ఏ మేరకు నష్టం వాటిల్లిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 16, 2023, 10:23 AM IST
Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత

న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉన్న కెర్మాడాక్ దీవుల్లో ఇవాళ ఉదయం భారీ భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప కేంద్ర 10 కిలోమీటర్ల లోతులో ఉండటంతో సునామీ హెచ్చరిక జారీ అయింది. 300 కిలోమీటర్ల వ్యాసార్ధంలో జనావాసాల్లేని ద్వీపాలకు సునామీ హెచ్చరిక ప్రకటితమైంది. 

భూమిలోపలి రెండు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్లు పసిఫిక్ ప్లేట్, ఆస్ట్రేలియన్ ప్లేట్ ఆనుకున్న ఉండటంతో న్యూజిలాండ్ తరచూ భూకంపాలకు లోనవుతుంది. రింగ్ ఆఫ్ పైర్ అని పిలిచే తీవ్రమైన భూకంప కార్యకలాపాల జోన్‌లో న్యూజిలాండ్ ఉంది. న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్‌టన్ సమీపంలో 6.1 తీవ్రతతో గత నెల 15వ తేదీన భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా ఏమేరకు నష్టం వాటిల్లిందనే వివరాలు ఇంకా తెలియలేదు. అటు సునామీ హెచ్చరిక కూడా జనావాసాల్లేని ద్వీపానికి ఉండటంతో ముప్పుండదని అధికారులు తెలిపారు. 

మరోవైపు మొన్నటి వరకూ వరుస భూకంపాలతో తీవ్ర విలయానికి లోనైన టర్కీలో ఇప్పుడు మరో విపత్తు సంభవించింది. భారీ వరదలతో ఆ దేశం అతలాకుతలమౌతోంది.ఇప్పటికే 14 మంది వరదల కారణంగా మరణించినట్టు తెలుస్తోంది. అటు భూకంపం కారణంగా టర్కీ దాదాపుగా నాశనమైంది. భూకంపం కారణంగా టర్కీలో 50 వేల మంది మృత్యువాత పడ్డారు. 

Also read: Lockdown: భారీగా పెరుగుతున్న కేసులు.. మరోసారి లాక్‌డౌన్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News