Earthquake: అలస్కాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు..

Earthquake today: ఇవాళ తెల్లవారుజామున యూఎస్ లోని అలస్కా ద్వీపకల్ప ప్రాంతంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ క్రమంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2023, 03:32 PM IST
Earthquake: అలస్కాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు..

Earthquake in Alaska Peninsula: అమెరికాలోని అలస్కా (Alaska)లో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దాని తీవ్రత 7.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్‌ సర్వే (USGS) వెల్లడించింది. ఈ నేపథ్యంలో అధికారులు సునామీ (Tsunami) హెచ్చరికలు జారీ చేశారు. అలస్కాకు  9.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అలస్కా ద్వీపకల్పం, అలూటియన్ దీవులు, కుక్ ఇన్‌లెట్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్టు అలస్కా భూకంప కేంద్రం పేర్కొంది. అయితే, ఈ ఘటనలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన ఎటువంటి వివరాలు తెలియరాలేదు. 

1964 మార్చిలో అలస్కాలో 9.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విపత్తు వల్ల 250మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది అలస్కాలోని యాంకరేజ్ నగరాన్ని నాశనం చేసింది. ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు వచ్చిన భూకంపాల్లో అదే అత్యంత తీవ్రమైనదిగా పేర్కొంటారు.  అలస్కా ప్రాంతం రింగ్ ఆఫ్ ఫైర్ లో భాగంగా ఉంది. అందుకే తరుచూ భూకంపాలకు గురవుతూ ఉంటుంది. ఈ భూకంపం కారణంగా దక్షిణ అలస్కా, అలస్కా ఐలాండ్ ని సునామీ చుట్టుముట్టే ప్రమాదం ఉన్నదని  పామర్‌లోని జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. 

Also Read: Nepal Helicopter Crash: నేపాల్‌లో కుప్పకూలిన హెలికాప్టర్‌.. ఆరుగురు దుర్మరణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News