Los Angeles Wild Fire: అమెరికా లాస్ ఏంజిల్స్ నగరంలో చెలరేగిన కార్చిచ్చు ఇంకా తగ్గలేదు సరికదా అంతకంతకూ పెరుగుతోంది. హాలీవుడ్ టౌన్‌గా పిల్చుకునే లాస్ ఏంజిల్స్‌లో మంటల ధాటికి భారీ భవంతులు కాలి బూడిదయ్యాయి. 28 మది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి.
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. జనవరి 7న ప్రారంభమైన మంటలు ఇప్పటికీ చల్లారలేదు. ఇంకా విస్తరిస్తూనే ఉన్నాయి. ప్రపంచానికే ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచిన ఈ నగరంలో చాలా ప్రాంతాలు మంటల కారణంగా ఇప్పటికే కాలిబూడదయ్యాయి. మంటల్లో చిక్కుకుని 28 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 వేలకు పైగా నివాసితుల్ని ఖాళీ చేయించారు. భారీ భవంతులు అగ్నికి ఆహుతయ్యాయి. అడవుల్లో ప్రారంభమైన మంటలు నగరాన్ని చుట్టుముట్టి విలువైన ఆస్తుల్ని దగ్దం చేశాయి. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది.
ఇప్పుడు మరోసారి కాస్టిక్ సరస్సు సమీపంలో చెలరేగిన మంటలు అత్యంత వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. గంటల వ్యవధిలో 8 వేల ఎకరాలు అగ్నికీలలకు ఆహుతయ్యాయి.శాంటా అనాలో వీస్తున్న గాలులతో మంటలు ఉధృతమౌతున్నాయి. మంటల కారణంగా ఏర్పడే పొగతో నల్లటి మేఘాలు ఏర్పడి వాతావరణం కాలుష్యంగా మారుతోంది. లాస్ ఏంజిల్స్‌లో గంటకు 20-30 మైళ్ల వేగంతో వీస్తున్న గాలుల కారణంగా మంటల ఉధృతి అధికంగా ఉంటోంది. మంటల తీవ్రత పెరుగుతుండటంతో నివాస ప్రాంతాల్ని ఖాళీ చేయిస్తున్నారు. గంటల వ్యవధిలో 39 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలోని చెట్లు, పొదలు కాలిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇటీవల కార్చిచ్చుకు ఆహుతైనా ఈటన్, పాలిసేడ్స్, కౌంటీ ప్రాంతాలు ఇప్పుడు మంటలు చెలరేగిన ప్రాంతానికి 64 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ గాలులు దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా చెలరేగిన కార్చిచ్చుతో 50 వేలమందిని ఖాళీ చేయించాల్సి వస్తోంది. ఇప్పటికే విమానాలతో వాటర్ బాంబులు జారవిడుస్తూ మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మంటలు క్రమంగా దక్షిణ కాలిఫోర్నియాకు వ్యాపిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి