Johnson and Johnson Vaccine: కరోనా మహమ్మారి నియంత్రణకు మరో వ్యాక్సిన్ అందుబాటులో వస్తోంది. యూకే ప్రభుత్వం జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు ఆమోదముద్ర వేసింది. ఈ వ్యాక్సిన్ మిగిలిన వ్యాక్సిన్‌లకు భిన్నంగా ఉంటుంది.
ప్రపంచంలో ఇప్పటి వరకూ 5-6 రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మరో వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది. ముఖ్యంగా యూకే ప్రభుత్వం(UK Government)జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన ప్రత్యేక వ్యాక్సిన్‌కు అనుమతిచ్చింది. యూకేలో ఆమోదం పొందిన నాలుగవ వ్యాక్సిన్ ఇది. అనుమతివ్వడమే కాకుండా 2 కోట్ల వ్యాక్సిన్లకు బ్రిటన్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది.
ఇప్పటి వరకూ ప్రపంచంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లకు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్(Johnson and Johnson vaccine) విభిన్నమైంది. అన్ని వ్యాక్సిన్లు రెండు డోసులు కాగా..జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ మాత్రమే కేవలం ఒకే ఒక డోసు. రానున్న రోజుల్లో సింగిల్ డోసు వ్యాక్సిన్ ముఖ్యమైన పాత్ర పోషించనుందని యూకే హెల్త్ అండ్ సోషల్ కేర్ విభాగం తెలిపింది. ఇండియాలో కొత్త వేరియంట్( Corona New Variant) వెలుగుచూసిన నేపధ్యంలో యూకేలో పెద్దఎత్తున యువత వ్యాక్సిన్ కోసం ముందుకొస్తోంది. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ 72 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని అమెరికా ట్రయల్స్‌లో వెల్లడైంది. ఇప్పటి వరకూ యూకేలో దాదాపు సగం జనాభాకు ఒక డోసు వ్యాక్సిన్ పూర్తయిందని తెలుస్తోంది. మిగిలిన వ్యాక్సిన్‌లతో పోలిస్తే జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు వ్యాక్సిన్( Single Dose Vaccine) ఆలస్యంగానే అనుమతులు పొందింది.
Also read: Pfizer COVID-19 Vaccine: భారత్‌కు 50 మిలియన్ల వ్యాక్సిన్ డోసుల సరఫరాకు అమెరికా ఫార్మా సంస్థ రెడీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook