Israel Hamas Conflict: ఇజ్రాయెల్ సైన్యం పొరపాటు.. కాల్పుల్లో ముగ్గురు బందీలు హతం

Israel Hamas War Latest Updates: గాజాలో దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం పొరపాటున ముగ్గురు బందీలను కాల్చి చంపింది. హమాస్ చెరలో ఉన్న ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను హతమార్చినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2023, 07:33 AM IST
Israel Hamas Conflict: ఇజ్రాయెల్ సైన్యం పొరపాటు.. కాల్పుల్లో ముగ్గురు బందీలు హతం

Israel Hamas War Latest Updates: హమాస్ ఉగ్రవాదులను సమూలంగా మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్ సైన్యం గాజాలో దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయెలో సైన్యం పొరపాటు హమాస్ చెరలో ఉన్న ముగ్గురు బందీలను కాల్చి చంపింది. శుక్రవారం గాజా స్ట్రిప్‌లో హమాస్‌తో జరిగిన పోరాటంలో ఇజ్రాయెల్ సేనలు పొరపాటున ముగ్గురు బందీలను హతమార్చినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. షెజైయాలో ఉగ్రవాదులను ఏరివేస్తున్న క్రమంలో పొరపాటున హమాస్ చెరలో ఉన్న ముగ్గురు బందీలను సైన్యం కాల్చి చంపిందని.. జరిగిన సంఘటనకు తాము విచారం వ్యక్తం చేస్తున్నామని పేర్కొంది. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. 

"ఉగ్రవాదులపై సైనికులు కాల్పులు జరిపారు.  ఈ కాల్పుల్లో వారు మరణించారు. ఘటన జరిగిన ప్రాంతంలో సోదాలు, తనిఖీలు నిర్వహించాం. అయితే మృతుల వివరాలపై అనుమానం వచ్చింది. వారి మృతదేహాలు పరీక్ష కోసం ఇజ్రాయెల్ తీసుకువచ్చాం. మృతుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ బందీలుగా ఉన్నట్లు గుర్తించాం.. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి సమయంలో కిడ్నాప్ చేసిన బందీలలో ఇద్దరిని యోతమ్ హైమ్‌, సమీర్ తలాల్కాగా తేలింది. మూడో వ్యక్తి పేరును బయటపెట్టవద్దని కుటుంబ సభ్యులు కోరారు.  ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నాం.." అని ఐడీఎఫ్‌ తెలిపింది.

అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు వేలాది రాకెట్లతో దాడులు చేసి.. భూమార్గం ద్వారా ఆ దేశంలోకి చొరబడ్డారు. కనిపించిన వాళ్లను కాల్చుకుంటూ వెళుతూ.. ఇజ్రాయెల్ పౌరులను చిత్రహింసలకు గురి చేశారు. 1200 మందికిపైగా అమాయక ప్రజలను హతమర్చారు. 250 మంది బందీలను పాలస్తీనియన్ గ్రూపులు గాజాలోకి తీసుకువెళ్లాయి. ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్.. గాజాలో ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేసేందుకు కంకణం కట్టుకుంది.

ఉగ్రవాదులు ఎక్కడా దాక్కున్న వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేస్తోంది. హమాస్ చెరలో ఉన్న బందీలను రక్షించడమే తమ లక్ష్యమంటూ గాజా స్ట్రిప్‌లో దాడులు కొనసాగిస్తోంది. బందీలుగా ఉన్న వారందరినీ స్వదేశానికి తీసుకురావడం తమ ప్రధాన లక్ష్యాలలో ఒకటి అని ఇజ్రాయెల్ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటివరకు గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 18,700 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారని వెల్లడించింది. ఇంకా వేలాది మంది తప్పిపోయారని.. శిథిలాల కింద చిక్కుకుపోయారని పేర్కొంది. గాజాపై యుద్ధం ఆపాలని.. మానవాత సాయం చేసేందుకు వీలు కల్పించాలని అంతర్జాతీయ సంస్థలు, అమెరికా కోరుతున్నా.. హమాస్‌పై విజయం సాధించేవరకు వెనక్కి తగ్గేదిలేదంటూ ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది.

Also Read: ఈ సంవత్సరం అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు ఇవే.. మరీ ఇంత దారుణంగా..!

Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం.. ఆ ఇబ్బందులకు చెక్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News