రష్యన్ కరోనా వ్యాక్సిన్ ( Russian vaccine ) స్పుత్నిక్ వి ( Sputnik v ) పై భారత్ దృష్టి పెట్టిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. వ్యాక్సిన్ పనితీరుపై భారత అభ్యర్ధన మేరకు రష్యా ఆ సమాచారాన్ని పంపింది. త్వరలో ఇరుదేశాల మధ్య ఈ వ్యాక్సిన్ పై నిర్ణయం వెలువడనుంది.
ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ ను కనుగొన్నామని రష్యా ప్రకటించినప్పటి నుంచీ సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొంత వివాదం, మరి కొందరి సందేహాల మధ్య రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపధ్యంలో భారతదేశం ( India ) మాత్రం ఆ వ్యాక్సిన్ పై దృష్టి పెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ( Russia president vladimir putin ) స్వయంగా ప్రకటించారు కూడా. భారత్ సహా 20 దేశాలు తమ దేశ వ్యాక్సిన్ కోరుతున్నాయని పుతిన్ చెప్పారు. ఇప్పుడీ విషయాన్ని అధికారికంగా కేంద్ర ఆరోగ్య. మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ( Rajesh Bhushan ) వెల్లడించారు. స్పుత్నిక్ వి కు సంబంధించినంతవరకూ ఇండియా, రష్యాలు సమాచారాన్ని బదిలీ చేసుకున్నాయని చెప్పారు. వ్యాక్సిన పనితీరుపై సమాచారాన్ని అందించాలని భారత్ గతంలో కోరగా...దానికి అంగీకరించిన రష్యా ఆ సమాచారాన్ని భారత్ కు పంపింది. రష్యా నుంచి ప్రాధమిక సమాచారం అందిందని స్వయంగా రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాల్ని ( Sputnik v 3rd phase trials ) 45 మెడికల్ సెంటర్లలో 40 వేలమందిపై పెద్దఎత్తున పరిశీలిస్తున్నామని రష్యన్ న్యూస్ ఏజెన్సీ టాస్ ( TAAS ) తెలిపింది. ఈ వ్యాక్సిన్ ను భారీ ఎత్తున తయారీ కోసం భారత్ తో ఒప్పందం కుదుర్చుకోవాలని రష్యా నిర్ణయించుకుంది. రష్యా పంపించిన ప్రాధమిక సమాచారం, ఇప్పుడు జరుగుతున్న ఆఖరి దశ ట్రయల్స్ ఫలితాల్ని పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్సి రాజేష్ భూషణ్ ప్రకటించారు. Also read: Corona Study: కరోనా వైరస్ రాకూడదంటే..కిటికీలు తెర్చుకోవల్సిందే