Corona vaccination: ఇండియా ఈ ప్రపంచానికే గొప్ప ఆస్థి: ఐక్యరాజ్యసమితి ప్రశంసలు

Corona vaccination: కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతూనే భారతదేశం పాత్రను అందరూ గుర్తిస్తున్నారు. మొన్న బ్రెజిల్..నేడు ఐక్యరాజ్యసమితి. ఐరాస ఇప్పుడు ఇండియాపై ప్రశంసలు కురిపించింది.

Last Updated : Jan 31, 2021, 09:24 PM IST
Corona vaccination: ఇండియా ఈ ప్రపంచానికే గొప్ప ఆస్థి: ఐక్యరాజ్యసమితి ప్రశంసలు

Corona vaccination: కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతూనే భారతదేశం పాత్రను అందరూ గుర్తిస్తున్నారు. మొన్న బ్రెజిల్..నేడు ఐక్యరాజ్యసమితి. ఐరాస ఇప్పుడు ఇండియాపై ప్రశంసలు కురిపించింది.

ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ ( World's largest vaccination program ) కార్యక్రమం ఇండియాలో నడుస్తోంది. జనవరి 16 నుంచి ప్రారంభమై..అప్పుడు 30 లక్షల మార్క్ దాటేసింది. మరోవైపు ఇండియా నుంచి పెద్దఎత్తున వ్యాక్సిన్ విదేశాలకు ఎగుమతి అవుతోంది. భారీ ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగల ఇండియా సామర్ధ్యం ప్రపంచానికి ఓ ఆస్థి అని ఐక్యరాజ్యసమితి ( UNO ) అభివర్ణించింది. 

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ( Corona vaccination ) ‌పై మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి  ( UNO ) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రాస్ స్పందించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇండియా కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఇండియా కూడా ఇందుకు సిద్ధంగా ఉన్నట్టు భావిస్తున్నామన్నారు. ఇండియాలో తయారవుతున్న వ్యాక్సిన్‌ల గురించి తమకు తెలుసని..ఆ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని కూడా స్పష్టం చేశారు. 

ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ ( World Health Organisation ) సైతం ఇండియాపై ప్రశంసలు కురిపించింది. కరోనా వైరస్ కట్టడిలో ప్రపంచదేశాలకు సహాయం చేస్తున్నందుకు దేశానికి, ప్రధాని మోదీకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ఇండియా..నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, మాల్దీవ్స్, షీసెల్స్ దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోంది. మరోవైపు బ్రెజిల్‌, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మారిషస్ దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేస్తోంది.  త్వరలో ఒమన్, నికరాగ్వా, కరేబియన్ దేశాలతో పాటు పసిఫిక్ దేశాలకు కూడా వ్యాక్సిన్ అందించనుంది.

Also read: Poisonous letter: ఆ దేశాధ్యక్షుడిని చంపేందుకు విషం పూసిన లేఖ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News