Pakistan: పాకిస్తాన్‌లో అష్టకష్టాలు పడి ప్రభుత్వాన్ని నడిపించుకొస్తున్నారు ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు, స్థానికంగా వ్యతిరేకత ఉన్నా విశ్వాస పరీక్షలో బలం నిరూపించుకుని గండం నుంచి గట్టెక్కారు.
భారతదేశ దాయాది దేశం పాకిస్థాన్(Pakistan)లో ప్రభుత్వం ఇరకాటం నుంచి బయటపడింది. దేశంలో చాలా కాలంగా ఆర్ధిక పరిస్థితులు సరిగ్గా లేవు. ఆర్ధిక ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయి. ఓ దశలో తినడానికి తిండి దొరకని పరిస్థితి కూడా ఏర్పడింది. మరోవైపు టెర్రరిస్టు కార్యకలాపాలకు ఊతమిస్తుందనే ఆరోపణలతో ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్(FATF Grey List)లో ఉంచడంతో ప్రపంచ దేశాల్నించి ఆర్ధిక సహాయం కూడా అందని పరిస్థితి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం నడిపించడం కూడా ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు సవాలుగా మారింది. స్థానికంగా, ప్రతిపక్షాల్నించి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.
అదే సమయంలో ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురైంది తాజాగా. సెనేట్ ఎన్నికల్లో పాకిస్తాన్ ఆర్ధిక మంత్రి, అధికార పార్టీ అభ్యర్ధి అబ్దుల్ హఫీజ్ షేక్ ఓటమి పాలవడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే ఇమ్రాన్ ఖాన్ నేషనల్ అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని స్పష్టం చేశారు. పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ఆదేశాల మేరకు పార్లమెంట్ సమావేశమైంది. మొత్తం 342 సభ్యులున్న సభలో 172 ఓట్లు అధికార పార్టీకు రావల్సి ఉంది. 11 పార్టీల కూటమిగా ఉన్న ప్రతిపక్ష పాకిస్తాన్ డెమోక్రటిక్ మూమెంట్ ఓటింగ్ సమయంలో వాకౌట్ చేయడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ సునాయసంగా ఓటింగ్‌లో గట్టెక్కింది. 2018లో ఇమ్రాన్ ఖాన్ (Imran khan)నేతృత్వంలోని పార్టీకు 176 స్థానాలు వస్తే..ఇప్పుడు బలపరీక్షలో 178 ఓట్లు రావడం విశేషం.
Also read: Farmers protest on time magazine: టైమ్ మేగజైన్ పతాక శీర్షికనెక్కిన రైతుల ఆందోళన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Pakistan: విశ్వాస పరీక్షలో గెలిచిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్
విశ్వాస పరీక్షలో గెలిచిన పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్
సెనేట్ ఎన్నికల్లో పాక్ మంత్రి ఓటమితో అనివార్యమైన బలపరీక్ష
ప్రతిపక్షాలు గైర్హాజరవడంతో ఓటింగ్‌లో సునాయంగా గెలిచిన ఇమ్రాన్ ఖాన