Hezbollah Commander: లెబనాన్‌లోని పశ్చిమ బెకా ప్రాంతంలో హిజ్బుల్లా సీనియర్ అధికారి మహమ్మద్ హమ్మదీ మంగళవారం హత్యకు గురయ్యారు. తూర్పు లెబనాన్ పట్టణం మచ్‌ఘ్రాలో తన ఇంటి వెలుపల నిలబడి ఉన్న షేక్ మహ్మద్ హమ్మదీపై రెండు వాహనాల్లో వచ్చిన ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో హమ్మదీకి పలు బుల్లెట్లు తగిలాయి. గాయపడిన హమ్మదీని వెంటనే సమీపంలోని సోహ్మోర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ వైద్యులు హిజ్బుల్లాకు అనుబంధంగా ఉన్న హమ్మదీ చనిపోయినట్లు ప్రకటించారు. కాల్పుల అనంతరం గుర్తుతెలియని దుండగులు పారిపోగా, ఘటనపై స్థానిక యంత్రాంగం విచారణ జరుపుతోంది.
హిజ్బుల్లా కమాండర్ మహమ్మద్ హమ్మదీని అతని ఇంటి ముందు కాల్చి చంపినట్లు లెబనాన్ అల్-అఖ్బర్ నివేదించింది. రెండు వాహనాల్లో వచ్చిన దుండగులు హమ్మదీపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ హత్యకు కారణమేమిటో, దీని వెనుక ఎవరున్నారో స్పష్టంగా తెలియరాలేదు. లెబనాన్‌లో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ హత్య జరిగింది.
Also Read: Budget 2025: తులం బంగారం రూ. 82వేలు.. బడ్జెట్ తర్వాత ఏం జరుగుతుంది? భారీగా పెరగడం ఖాయమేనా?
మహ్మద్ హమ్మదీ హత్య తరువాత, లెబనీస్ ఆర్మీ యూనిట్లు మచ్ఘరాను ముట్టడించాయి. పశ్చిమ బెకాలోని పట్టణాల్లో భద్రతా బలగాలు మొబైల్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి దాడి చేసిన వారి కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నాయి. హత్యకు సంబంధించి హిజ్బుల్లా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఈ పరిణామం మధ్య ఉత్తర లెబనాన్‌లో 60 రోజుల కాల్పుల విరమణ మొదటి దశ ఆదివారంతో ముగియనుంది. ఈ ఒప్పందం ప్రకారం, ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్ నుండి తన బలగాలను ఉపసంహరించుకోవాలి. ఇజ్రాయెల్ సరిహద్దులో వారిని మోహరించాలి. ఒక సీనియర్ పాశ్చాత్య దౌత్యవేత్త మాట్లాడుతూ గడువు ముఖ్యమైనది కాదు. ఇజ్రాయెల్ తన దళాలను వారు ఉన్న ప్రాంతాల నుండి ఉపసంహరించుకోవాలని మేము ఆశిస్తున్నాము అని తెలిపారు.
ఇంతలో, కొత్త సిరియన్ ప్రభుత్వం లెబనాన్‌తో తమ భాగస్వామ్య సరిహద్దులో స్థిరత్వాన్ని కొనసాగించాలనే కోరికను వ్యక్తం చేసింది. ఇరాన్, హిజ్బుల్లా సిరియా నుండి లెబనాన్‌కు ఆయుధ సరఫరాలను తిరిగి ప్రారంభించకుండా అడ్డుకుంటామని సిరియా ప్రభుత్వం అంతర్జాతీయ సమాజానికి, ఇజ్రాయెల్‌కు సందేశం పంపింది.
Also Read: Denta Water IPO: డెంటా వాటర్ ఐపీఓ..నిమిషాల్లో సబ్‌స్క్రిప్షన్ పూర్తి..జీఎంపీ చెక్ చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.