Hanuma Vihari Ranji Team: టీమిండియా టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న హనుమ విహారి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విహరి.. ఈ సీజన్‌లో కొత్త జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు రెడీ అవుతున్నాడు. నూతన జట్టు తరఫునే రంజీ ట్రోఫీ ఆడనున్నాడు. హనుమ విహారి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ జట్టులో దేశవాళీ క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే.
ఈ దేశవాళీ సీజన్ నుంచి మధ్యప్రదేశ్ జట్టు తరఫున హనుమ విహారి ఆడనున్నాడు. ప్రస్తుత జట్టు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కోచ్ చంద్రకాంత్ పండిట్ ఆధ్వర్యంలో ఆడేందుకు ఎంపీ జట్టుకు మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శుభమ్ శర్మ, రజత్ పాటిదార్, వెంకటేష్ అయ్యర్‌లతో కూడిన మిడిల్ ఆర్డర్‌లో విహారి చేరనున్నాడు. మధ్యప్రదేశ్ కెప్టెన్‌గా కూడా ఎంపిక అయ్యే ఛాన్స్ ఉంది.
హనుమ విహారి గతేడాది జూలైలో బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో భారత్ తరఫున తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఫ్లాప్ అవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 11 రన్స్ మాత్రమే చేశాడు. అప్పటి నుంచి మళ్లీ జట్టులో స్థానం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడాడు. వెస్టిండీస్‌పై ఒక సెంచరీతో 33.56 సగటుతో 839 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
విహారి తన ఇటీవల దేశవాళీ టోర్నీల్లో 14 ఇన్నింగ్స్‌లలో 490 పరుగులు చేశాడు. ఆంధ్ర జట్టును నాకౌట్ రౌండ్‌కు చేర్చాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. తన చేయి విరిగినా.. స్వతహాగా కుడిచేతి వాటం అయినప్పటికీ చివరి వికెట్‌గా క్రీజ్‌లోకి ఎడమచేతితో బ్యాటింగ్ చేశాడు. హనుమ విహారి తన కెరీర్‌ను హైదరాబాద్ తరఫున ప్రారంభించాడు. 2015-16 సీజన్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా.. 2021-22 సీజన్‌లో మళ్లీ హైదరాబాద్ జట్టుకు మారాడు. ఆ తరువాత తిరిగి ఆంధ్రా జట్టుకు ఆడాడు. ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 113 మ్యాచ్‌లు ఆడగా.. 53.41 సగటుతో అతని బ్యాట్‌లో 8600 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 45 అర్ధసెంచరీలు ఉన్నాయి.
Also Read: Pawan Kalyan Tholi Prema: పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ రీరిలీజ్.. థియేటర్‌లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ
Also Read: Maharashtra Bus Accident: ఘోర బస్సు ప్రమాదం.. 25 మంది సజీవ దహనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook