Yahya Sinwar Killed: ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో తమ అధినేత యాహ్యా సిన్వార్ దుర్మరణం చెందినట్లు హమాస్ కూడా ధ్రువీకరించింది. పాలస్తీనా కోసం తుది వరకు పోరాడి ప్రాణాలను కోల్పోయినట్లు తెలిపింది. అయితే తమ ప్రాంతంపై దాడులను ఆపి, ఇజ్రాయెల్ దళాలు వెనక్కు వెళ్లేంత వరకు ..యుద్దం ముగించేంత వరకు బందీలను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ హమాస్ తేల్చి చెప్పింది.
హమాస్ అధినేత మరణంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. హమాస్ ఆయుధాలను వదిలి..తమ బందీలను తిరిగి పంపిస్తే..వెంటనే యుద్ధం ముగుస్తుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అదేవిధంగా తమ పౌరులను విడిచిపెడితే హమాస్ మిలిటెంట్లకు స్వేచ్ఛగా జీవించే అవకాశం కూడా కల్పిస్తామని తెలిపారు. లేదంటే వేటాడి వెంటాడి మరీ హతమార్చుతామంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే హమాస్ కూడా స్పందించింది.
Also Read: Health Tips: సడెన్‌గా బీపీ డౌన్ అయ్యిందా.. అయితే ఈ చిట్కాలు పాటిస్తే నార్మల్ అవుతుంది
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 62 మంది మరణించారు. 300 మందికిపైగా గాయపడ్డారు. అటు ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 42,500కు చేరుకున్నట్లు గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 10లక్షల మంది గాయపడినట్లు వెల్లడించింది.
కాగా బుధవారం ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడిలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మరణించారు. అయితే, హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ డిఎన్ఎ పరీక్ష, ఇతర పరిశోధనలు మరణాన్ని ధృవీకరించిన తర్వాత ఇజ్రాయెల్ గురువారం అధికారికంగా ఆయన మరణాన్ని ప్రకటించింది. అక్టోబరు 7 నాటి నేరస్తులతో మన సైన్యం స్కోరును పరిష్కరించిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. అయితే, హమాస్‌పై యుద్ధం ఇంకా ముగియలేదని, బందీలను విడుదల చేసే వరకు, ఇతర ఉగ్రవాదులు లొంగిపోకుండా ఇది కొనసాగుతుందని కూడా ఆయన చెప్పారు. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై తీవ్రవాద దాడి చేసిందని, ఇందులో 1200 మందికి పైగా ఇజ్రాయెల్‌లు మరణించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.