భారత పర్యటనలో ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ

భారత పర్యటనలో ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ

Last Updated : Sep 19, 2018, 05:11 PM IST
భారత పర్యటనలో ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ

ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ బుధవారం న్యూఢిల్లీలో వచ్చారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ఆయన్ను కేంద్రమంత్రి, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనటానికి ఆయన భారత పర్యటనకు వచ్చారు.

ఒక్కరోజు భారత పర్యటనకు వచ్చిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు ప్రాంతీయ భద్రత, వాణిజ్యం,  ఆఫ్ఘనిస్తాన్ లో భారతదేశ అభివృద్ధి పనుల గురించి చర్చించనున్నారు. ఇరు నాయకులు భారతదేశం ద్వారా ఆఫ్గనిస్తాన్ లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను పురోగతి సమీక్షించాలని భావిస్తున్నారు.

 ఆఫ్ఘనిస్థాన్ పునర్‌నిర్మాణానికి భారత్ వేల కోట్ల రూపాయలతో అనేక ప్రాజెక్టులను చేపట్టింది. మౌలిక వసతులతో పాటు పవర్ ప్రాజెక్టులు, రహదారులు, పోర్టులు.. ఇలా ఇతర అనేక అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది. ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో ఆఫ్ఘనిస్థాన్‌కు పార్లమెంట్‌ను కట్టి ఇచ్చింది. సల్మా డ్యామ్‌ను పునర్‌నిర్మించింది. భారత్-ఆఫ్ఘనిస్థాన్ ఫ్రెండ్‌షిప్ డ్యామ్‌ను అని పిలుచుకొనే ఈ డ్యామ్‌ను భారత్ 1775 కోట్ల రూపాయలతో నిర్మించింది. 218 కిలోమీటర్ల మేర ఇరాన్-ఆఫ్ఘన్ మధ్య చబహార్ పోర్ట్‌ను కలిపేందుకు రహదారులను నిర్మించేందుకు భారత్ 600 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.

 

Trending News