శ్రీలంకలో పేలిన 8వ బాంబ్.. 162కి చేరిన మృతుల సంఖ్య

శ్రీలంకలో పేలిన 8వ బాంబ్.. 162కి చేరిన మృతుల సంఖ్య

Last Updated : Apr 21, 2019, 11:24 PM IST
శ్రీలంకలో పేలిన 8వ బాంబ్.. 162కి చేరిన మృతుల సంఖ్య

కొలంబొ: శ్రీలంకను వరుస పేలుళ్లు కుదిపేస్తున్నాయి. ఆదివారం ఉదయం పేలిన వరుస బాంబు పేలుళ్లతో రాజధాని కొలంబోతోపాటు పలు ఇతర పట్టణాలు పూర్తి రక్తసిక్తమయ్యాయి. ఆరు వరుస పేలుళ్లతో కొలంబో, నగొంబో, బట్టిలోవ పట్టణాలు వణికిపోయాయి. ఈ పేలుళ్లు మిగిల్చిన విషాదం ఇంకా మరిచిపోకముందే నాలుగైదు గంటల వ్యవధిలో మరో రెండు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. దీంతో ఆరు పేలుళ్ల అనంతరం 129కి చేరిన మృతుల సంఖ్య మరో రెండు పేలుళ్ల తర్వాత 162కి చేరాయి. అన్ని పేలుళ్ల తర్వాత మొత్తం క్షతగాత్రుల సంఖ్య 400కుపైకి చేరినట్టు శ్రీలంక మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. 

ఈస్టర్ సండే పర్వదినాన చోటుచేసుకున్న ఈ ఉగ్రదాడుల వెనుక మత కలహాలు రేపే అసాంఘీక శక్తుల హస్తం ఉండి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Trending News