Earthquake in Turkey, Syria: టర్కీలో మరోసారి భారీ భూకంపం.. 1600 దాటిన మృతుల సంఖ్య!

Earthquake: సిరియాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత అధికంగా ఉండటంతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అటు టర్కీలో కూడా తీవ్ర భూకంపం నమోదైంది. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 6, 2023, 04:49 PM IST
  • టర్కీ, సిరియాలలో బారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు
  • సిరియాలో 86 మంది, టర్కీలో 53 మంది మృతి, 1000 మందికి గాయాలు
  • భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం, ఇటలీలో సునామీ హెచ్చరికలు జారీ
Earthquake in Turkey, Syria: టర్కీలో మరోసారి భారీ భూకంపం.. 1600 దాటిన మృతుల సంఖ్య!

Earthquake in Turkey and Syria: టర్కీ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో భూకంపం విధ్వంసం సృష్టించింది. టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. పెద్దసంఖ్యలో మరణాలు సంభవించాయి. మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 1600 మందికి పైగా దుర్మరణం చెందారు. టర్కీలో మరోసారి భూకంపం వచ్చింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 7.5గా నమోదైనది. మృతుల సంఖ్య భారీగా పెరగనుంది. 

దక్షిణ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. భూ ప్రకంపనల ప్రభావం యూరప్‌లో గ్రీస్, మిడిల్ ఈస్ట్‌లో సిరియా, లెబనాన్ వరకూ కన్పించింది. అటు ఇటలీలో కూడా సునామీ అలర్ట్ జారీ అయింది. భూకంపం కారణంగా టర్కీలో 294 మంది, సిరియాలో 256 మంది మరణించారని తెలుస్తోంది. వందలాదిమంది శిధిలాల కింద ఉండిపోయారు. శిధిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దక్షిణ టర్కీలోని గాజియాన్ టేప్‌లో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఉంది.

టర్కీ భూకంపంలో టర్కీ సహా చుట్టుపక్కల దేశాల్లో భారీగా ప్రాణనష్టం నమోదవుతోంది. టర్కీ భూకంప మరణాల సంఖ్య 550కు చేరుకుంది. ఒక్క సిరియాలోనే 286 మంది మృత్యువాత పడ్డారు. టర్కీలో మృతుల సంఖ్య 296 కు చేరుకుంది. అధికారికంగా 2300 మంది గాయపడ్డారు. 

సిరియాలో 286 మంది మృతి, 1500 మందికి గాయాలు

సిరియాలో భూకంపం భారీ నష్టాన్ని మిగిల్చింది. పెద్ద పెద్ద భవంతులు ధ్వంసమయ్యాయి. 1000 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఎటుచూసినా హాహాకారాలు విన్పిస్తున్నాయి. టర్కీలోని వేర్వేరు ప్రాంతాల్లో కలిపి దాదాపు 296 మంది మరణించారు. 700 కంటే ఎక్కువమందికి గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

భూకంపంతో అతలాకుతలమైన టర్కీ

టర్కీ డిజాస్టర్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రెసిడెన్సీ ప్రకారం టర్కీలో 53 మంది మరణించారు. ఓ వ్యక్తి నీటిలో మునిగి చనిపోయాడు. భూకంపం కారణంగా 1000 మందికి గాయాలయ్యాయి. గ్రీస్ ఐలాండ్‌లో ఇద్దరు చనిపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇజ్మిర్‌లో 17 భవనాలకు నష్టం

టర్కీలో ఇజ్మిర్ పట్టణం భూకంపం కారణంగా తీవ్ర ప్రభావితమైంది. ఇక్కడ 17 భవంతులు పడిపోయాయి. చాలా భవనాలకు నష్టం కలిగింది. దాదాపు 2000 మంది ప్రభావితమయ్యారు. సహాయక చర్యల కోసం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇజ్మిర్‌లో ఇప్పటివరకూ ఇంత తీవ్రమైన భూకంపం సంభవించలేదు. 25-30 సెకన్ల వరకూ భూమి కంపించింది. 

టర్కీ దేశంలో సాధారణంగానే భూకంప తీవ్రతలు చాలా ఎక్కువ. 1999 ఆగస్టులో టర్కీలో ఇస్తాంబుల్ దక్షిణ తూర్పులో ఉన్న ఇజ్మిత్‌లో 7.6 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఇందులో 17 వేల కంటే ఎక్కువమంది చనిపోయారు. 2011లో టర్కీలో జరిగిన మరో భూకంపంలో 500 కంటే ఎక్కువమంది చనిపోయారు. 

Also read: China accident: 10 నిమిషాల్లో 49 వాహనాలు ఢీ.. 16 మంది మృత్యువాత..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News