Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదు

Earthquake: భూకంపాల పుట్టినిల్లైన ఇండోనేషియా మరోసారి వణికింది. ఇవాళ తెల్లవారుజామున భూమి కంపించింది. అటు సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 18, 2023, 09:41 AM IST
Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదు

ఇండోనేషియా మరోసారి కంపించింది. సులవేసి ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదవడంతో అటు సునామీ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. సులవేసి ప్రావిన్స్‌కు ఉత్తరాన 65 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం విస్తరించింది.

ఇండోనేషియాలోని సులవేసిలో ఇవాళ అంటే జనవరి 18 తెల్లవారుజామున భూమి భారీ భూకంపం సంభవించింది. సులవేసి ప్రావిన్స్‌కు 65 కిలోమీటర్ల దూరంలోని గొరొన్‌టాలో భూకంపకేంద్రంగా రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదైంది. అటు సముద్రంలో 145 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. అయితే ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఇండోనేషియా అధికారులు తెలిపారు. 

రెండ్రోజుల క్రితం కూడా ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. సుమత్రా దీవుల్లో జనవరి 16 ఉదయం 6.30 గంటలకు భూమి కంపించడంతో రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదైంది. అంతకుముందు వారం రోజుల క్రితం తనింబర్ ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూమి కంపించింది. ఇవాళ భూకంపం సంభవించిన సులవేసి ప్రాంతంలో ఇంతకుముందు అంటే 2018 భూకంపం, సునామీ కారణంగా 4,340 మంది మృత్యువాత పడ్డారు. 

నవంబర్ నెలలో 5.6 తీవ్రతతో పశ్చిమ జావాలో సంభవించిన భూకంపంలో 21 మంది మరణించారు. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన భారీ భూకంపం, సునామీ సృష్టింంచిన మహా విధ్వంసంలో 2,30 వేల మంది మరణించారు. ఇండోనేషియా చరిత్రలో అత్యంత దుర్భరమైన ఘటన ఇది. 

ఇండోనేషియా ప్రాంతం మొదట్నించి భూకంపాలకు, అగ్నిపర్వతాలకు నిలయం. తరచూ భారీ భూకంపాలు, సునామీలు, వాల్కనో ఉత్పాతాలు సంభవిస్తుంటాయి. ఈ ప్రాంతాన్ని రింగ్ ఆఫ్ ఫైర్, ఆర్క్ ఆప్ సిస్మిక్ ఫాల్ట్స్‌గా పిలుస్తుంటారు. 

Also read: Nepal Plane Crash Video: నేపాల్‌లో విమానం కుప్పకూలే ముందు లైవ్ వీడియో.. భయంకరమైన దృశ్యాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News