కరోనా ఫోర్త్‌వేవ్ భయం, ఆ దేశంలో పదిరోజులపాటు లాక్‌డౌన్

Corona Fourth Wave: కరోనా మహమ్మారి విజృంభణ నెమ్మదిగా పెరుగుతోంది. ముఖ్యంగా యూరప్ దేశాల్లో కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఆ దేశంలో అయితే ఏకంగా కరోనా ఫోర్త్‌వేవ్ వెంటాడుతోందని తెలుస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 23, 2021, 03:00 PM IST
కరోనా ఫోర్త్‌వేవ్ భయం, ఆ దేశంలో పదిరోజులపాటు లాక్‌డౌన్

Corona Fourth Wave: కరోనా మహమ్మారి విజృంభణ నెమ్మదిగా పెరుగుతోంది. ముఖ్యంగా యూరప్ దేశాల్లో కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఆ దేశంలో అయితే ఏకంగా కరోనా ఫోర్త్‌వేవ్ వెంటాడుతోందని తెలుస్తోంది.

కరోనా వైరస్(Coronavirus) మరోసారి పంజా విసురుతోంది. ప్రపంచ దేశాల్లో కరోనా సంక్రమణ మళ్లీ వేగం పుంజుకుంటోంది. ఇటీవలి కాలంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా..కొద్దిరోజుల్నించి మళ్లీ పెరుగుతున్నాయి. అటు యూరప్ దేశాల్లో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. యూరప్ దేశాల్లో ఒకటైన ఆస్ట్రియాలో ఇప్పుడు కరోనా ఫోర్త్‌వేవ్ వెంటాడుతోంది. ఈ దేశంలో గత పదిరోజుల వ్యవధిలో రోజుకు పది వేల కేసులు నమోదైన పరిస్థితి. ఫోర్త్‌వేవ్ కారణంగా ఆస్ట్రియాలో(Austria) నిన్న ఒక్కరోజే 15 వేల 297 కొత్త కేసులు నమోదయ్యాయి.

గత వారమైతే రోజుకు పదివేల వరకూ కొత్త కేసులు నమోదైన పరిస్థితి. ఫలితంగా దేశంలో పాక్షిక లాక్‌డౌన్(Lockdown) విధించాలని నిర్ణయించారు. గరిష్టంగా పదిరోజుల పాటు దేశంలో లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. తిరిగి పదిరోజుల తరువాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. పాక్షిక లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా షాపులు, రెస్టారెంట్‌లు మూతపడ్డాయి. దేశంలో 8.9 కోట్లమంది ఇంటికి పరిమితమైన పరిస్థితి. నిత్యావసర వస్తువులు లేదా ఆఫీసులకు వెళ్లేవారికి మాత్రం మినహాయింపు ఉంది. స్కూల్స్, కిండర్ గార్డెన్స్ తెరిచి ఉంచినా..ఆన్‌లైన్ తరగతులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోనివారికి మాత్రం లాక్‌డౌన్(Lockdown) కచ్చితంగా అమలవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.  లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠని చర్యలుంటాయని ఆస్ట్రియా పోలీసులు హెచ్చరించారు. మరోవైపు దేశంలో ఫిబ్రవరి 1 నుంచి ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ తప్పనిసరి చేయనుంది. పశ్చిమ యూరప్‌లో అతి తక్కువగా ఆస్ట్రియా దేశంలోనే 66 శాతం మందికి వ్యాక్సిన్ పూర్తయింది. 

Also read: ఘోరం: బస్సులో చెలరేగిన మంటలు...45 మంది సజీవదహనం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News