Drinking alcohol: మందు బాబులకు షాకింగ్ న్యూస్.. కొవిడ్​ కాలంలో మందు తాగితే అంతే సంగతి!

Drinking alcohol: కరోనా సమయంలో అమెరికాలో మందుబాబులు భారీగా పెరిగినట్లు ఓ సర్వేలో తేలింది. ఈ పరిస్థితి మరో ఏడాది కాలం కొనసాగితే.. ఆందోళకర స్థాయి మద్యపాన మరణాలు నమోదవ్వచ్చని అంచనా వేసింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2021, 10:36 PM IST
  • కొవిడ్ కాలంలో పెరిగిన మందుబాబులు
  • ఇదే పరిస్థితి కొనసాగితే మరణాల్లో భారీ వృద్ధి
  • అమెరికా సర్వేలో సంచలన విషయాలు..
Drinking alcohol: మందు బాబులకు షాకింగ్ న్యూస్.. కొవిడ్​ కాలంలో మందు తాగితే అంతే సంగతి!

Drinking alcohol: మందుబాబులకు షాకింగ్ న్యూస్​ చెప్పింది ఓ సర్వే. కొవిడ్ సమయంలో మద్యం తాగడం (Corona virus) వల్ల అనారోగ్య సమస్యలు, మరణాలు భారీగా పెరిగినట్లు తెలిపింది.

ముఖ్యంగా ఆల్కహాల్​ (మద్యపానం) తీసుకోవడం వల్ల లివర్​కు సంబంధించిన ఆనారోగ్య సమస్యలు తీవ్రమైనట్లు సర్వేలో తేలింది. 'హెపటాలజీ జర్నల్​'లో ఈ అధ్యాయనం పబ్లీష్ అయింది.

మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లోని పరిశోధకుల చేసిన ఈ సర్వేలో ఆందోళనకరమైన విషయాలు బయటపడ్డాయి. కొవిడ్ సమయంలో మద్యం తాగటం 21 శాతం పెరిగినట్లు తెలిసింది.

గత ఏడాది కాలంలో మద్యపాన మరణాలు.. సాధారణంతో పోలిస్తే 8,000 అధికంగా నమోదయ్యాయని పరిశోధకులు (Death due to alcohol) గుర్తించారు.

మద్యపానం సేవించే వారు పెరిగిన నేపథ్యంలో సగటుతో పోలిస్తే.. 2040 నాటికి మరణాలు, లివర్ సమస్యలు (liver disease), లివర్ క్యాన్సర్​లు భారీగా పెరగొచ్చని తెలిసింది. ఇంకా చెప్పాలంటే.. లివర్​ సమస్యల కేసులు సగటున 18,700, లివర్ క్యాన్సర్​ కేసులు సగటున 1,000 చొప్పున పెరగొచ్చని అంచనా వేశారు నిపుణులు.

2023 నాటికి మద్యపానం అధికంగా తీసుకోవం వల్ల సంభవించే మరణాల వార్షిక సగటు 100 పెరగొచ్చని, కేసులు 2,800 చొప్పున పెరిగే ప్రమాదముందని తెలిపింది సర్వే.

సర్వేలోని మరిన్ని ముఖ్యమైన విషయాలు..

గత ఏడాదినానే.. మరో సంవత్సరం పాటు మద్యపానం సేవించే వారు పెరుగుతూ పోతే.. మరణాల సంఖ్య 19-35 శాతం పెరిగే ప్రమాదం ఉంది.

కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో మద్యపానం తీసుకునే వారి సంఖ్యను తగ్గించేందుకు విధానపరమైన నిర్ణయాలు అవసరం.

Also read: YouTuber: భారీగా రిపేర్ బిల్లు వచ్చిందని.. రూ. 70 లక్షల విలువైన ఎలక్ట్రిక్ కారును పేల్చేసిన యూట్యూబర్!!

Also read: James Webb Space Telescope: ఖగోళ రహస్యాలను ఛేదించేందుకు... నింగిలోకి దూసుకెళ్లిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News