China Corona Cases: కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనా దేశంలో మరోసారి కొవిడ్ వేగంగా వ్యాపిస్తుంది. మంగళవారం ఒక్కరోజే 5 వేలకు పైగా కరోనా కేసులు నమోదైనట్లు చైనా ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది. అయితే కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇంతటి కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తాజాగా 5,280 మంది కరోనా బారిన పడినట్లు అధికారులు తెలిపారు.
చైనాలోని ముఖ్య నగరాలు లాక్ డౌన్
చైనాలోని ఈశాన్య జిలిన్ ప్రావిన్స్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆ ఒక్క ప్రావిన్స్‌లోనే గత కొన్నిరోజులుగా 3 వేలకు పైగా కొత్తగా కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే చైనా వ్యాప్తంగా వరుసగా ఆరో రోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మరోసారి విజృంభిస్తున్న కారణంగా దేశంలోని 11 ప్రముఖ నగరాలు లాక్ డౌన్ లోకి వెళ్లాయి.
చైనాలోని టెక్ హబ్ గా పేరొందిన షెన్ జెన్ లో కఠిన లాక్ డౌన్ అమలు అయ్యింది. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని షాంఘైలో ఎన్నడూ లేని విధంగా కరోనా ఇన్ఫెక్షన్స్ పెరిగాయి. పలు ఉత్పత్తులకు కేంద్రమైన డాంగ్వాన్ లో కార్యకలాపాలు నిలిచిపోయాయి.
కరోనా వ్యాప్తి ప్రారంభం..
చైనాలోని వుహాన్ నగరంలో 2019 ఏడాదిలో తొలి కరోనా కేసు నమోదయ్యింది. అయితే ఆ తర్వాత కొన్ని వ్యూహాలతో కొవిడ్ వ్యాప్తిని నియంత్రించడంలో అధికారులు విజయం సాధించారు. కఠిన లాక్ డౌన్ అమలు చేస్తూ.. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించే విధంగా ప్రభుత్వం యంత్రాంగం చర్యలు చేపట్టి కరోనా వైరస్ ను అదుపు చేసింది. ఇప్పుడు కరోనా వైరస్ మరోసారి చైనా ప్రభుత్వంతో పాటు అక్కడి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది.
Also Read: Russian Model Murdered: పుతిన్ పై విమర్శలు చేసిన రష్యన్ మోడల్ మృతి.. సూటుకేసులో మృతదేహం లభ్యం!
Also Read: Russia Ukraine War: పోలాండ్ సరిహద్దులో రష్యా భీకర దాడులు... 35 మంది మృతి, 134 మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook