British Flights Russia: బ్రిటీష్ విమానాలపై రష్యా ప్రభుత్వం నిషేధం.. కారణం అదేనా?

British Flights Russia: రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధవాతావరణం కొనసాగుతోంది. ఉక్రెయిన్ పై రష్యా తెగబడుతున్న వేళ ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో బ్రిటన్ విమానాలపై రష్యా నిషేధం విధించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2022, 04:50 PM IST
British Flights Russia: బ్రిటీష్ విమానాలపై రష్యా ప్రభుత్వం నిషేధం.. కారణం అదేనా?

British Flights Russia: ఉక్రెయిన్ పై యుద్ధానికి తెగబడిన రష్యాపై ప్రపంచంలో అనేక దేశాలు తప్పుబడుతున్నాయి. వెంటనే యుద్ధాన్ని ఆపి చర్చలకు దిగాలని ఐక్యరాజ్య సమితి సహా అనేక దేశాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు విజ్ఞప్తి చేశారు. అయినా పట్టువిడని పుతిన్.. ఉక్రెయిన్ రాజధాని కియూపై దాడి చేయిస్తున్నారు. ఈ క్రమంలో అనేక దేశాలు రష్యా తీరుపై మండిపడుతున్నాయి. రష్యాను ఆర్థికంగా, వాణిజ్యపరంగా ఒంటరిని చేయాలనే చర్యలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలో రష్యాకు చెందిన ఏరో ఫ్లోటో విమానయాన సంస్థ కార్యకలాపాలపై బ్రిటన్ గురువారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 

ఇప్పుడు అందుకు ప్రతీకారంగా రష్యా కూడా బ్రిటన్ విమానాలపై నిషేధాన్ని విధించింది. బ్రిటన్ కు చెందిన విమానాలను రష్యా భూభాగంలోకి ఇకపై అనుమతి లేదంటూ బ్రిటన్‌ పౌర విమానయాన నియంత్రణ సంస్థ శుక్రవారం వెల్లడించింది.

కొనసాగుతున్న ఉక్రెయిన్ - రష్యా వార్

మరోవైపు రష్యా చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ చేస్తోన్న ప్రయత్నాలు విఫలమవుతున్నట్లు తెలుస్తోంది. వరుసగా రెండో రోజు రష్యా సైన్యం.. ఉక్రెయిన్ రాజధాని కియూ రాజధాని సమీపంలో బాంబుదాడులు జరిగాయి. ఇప్పటికే రాజధాని కియూ వైపు రష్యా సైన్యం దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో.. శుక్రవారం ఉదయం.. నగరంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు కొన్ని ఇంటర్నేషనల్ వార్తాసంస్థలు ప్రకటించాయి.  

రష్యాకు చెందిన సైనికులు ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని కియూపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కియూ రాజధానిపై దాడిని ధీటుగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సైన్యం సిద్ధమైంది. ఇప్పటి వరకు తాము చేసిన దాడుల్లో 450 మంది రష్యా సైనికులు మరణించారని ఉక్రెయిన్ రక్షణశాఖ ప్రకటించింది.   

ALso Read: Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం- ఒంటరయ్యామన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు!

Also Read: Ukraine vs Russia: హింసను తక్షణమే ఆపండి.. పుతిన్‌ను కోరిన ప్రధాని మోదీ!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News