Indian Heart Gives Pakistan Teen new life to pak Teenager: గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న యువతికి, భారత వైద్యులు పునర్జన్మనిచ్చారు. ఢిల్లీకి చెందిన గుండెను, పాక్ కు తరలించారు. చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌లో మార్పిడి శస్త్రచికిత్స తర్వాత పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన యువతికి కొత్త జీవితంను ఇచ్చారు. చెన్నై నగరానికి చెందిన ఐశ్వర్యన్ ట్రస్ట్‌కు చెందిన సర్జన్లు, ఆసుపత్రి ఈ ప్రక్రియను ఉచితంగా నిర్వహించారు. గుండె మార్పిడి గ్రహీత 19 ఏళ్ల అయేషా రషన్ ఫ్యాషన్ డిజైన్‌ను చదవాలనుకుంటున్నట్లు తెలిపింది. ఆమెకు గుండె సంబంధిత సమస్యలు రావడంతో ఎక్మో మీద ఉంచి సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో.. ఐశ్వర్యన్ ట్రస్ట్ చెన్నై వైద్యుల మద్దతు లేకుండా ఆపరేషన్ చేసే ఆర్థిక స్థోమత లేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
Read More: Smita Sabharwal: వరల్డ్ బుక్ డే... వైరల్ గా మారిన స్మితా సబర్వాల్ చేసిన లేటెస్ట్ ట్వీట్..
డాక్టర్ల ప్రకారం, Ms రషన్ తీవ్రమైన గుండె పనిచేయకపోవటంతో అడ్మిట్ అయ్యింది. గుండె వైఫల్యం తర్వాత, ఆమె ECMO మీద ఉంచి చికత్స అందింస్తున్నారు. గుండె మార్పిడికి ₹ 35 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ట్రస్ట్ వాళ్లు ముందు ఉంచారు. రషన్ విషయంలో, ఈ బిల్లును వైద్యులు, ట్రస్ట్ కవర్ చేసింది. వెంటనే వైద్యులు దీనికి దాతలతో మాట్లాడి ఆపరేషన్ నిర్వహించారు.
ఈ క్రమంలో.. ఢిల్లీ నుంచి దాత నుంచి గుండె పాక్ కు తీసుకొచ్చారు. ఆ యువతి అదృష్టవంతురాలిని డాక్టర్ కేఆర్ బాలకృష్ణన్ డైరెక్టర్ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్), డాక్టర్ సురేష్ రావు (కో-డైరెక్టర్ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్) ల బృందం సర్జరీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దాయాదీ పాక్ కు చెందిన, యువతికి అవయవదానం చేయడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈ క్రమంలో.. పాక్ కు భారత గుండెను మార్పిడి చేయడంను అందరు, ప్రశంసిస్తున్నారు.
పాక్ ఎప్పుడు కూడా భారత్ ను బార్డర్ లో, అనేక విషయాలలో కవ్వింపు చర్యలకు పాల్పడుతునే ఉంటుంది. ముఖ్యంగా చైనా కలిసి భారత్ బార్డర్ లోకి అక్రమంగా ప్రవేశించడం చేస్తుంటుంది. ఇప్పటికే పాకిస్థాన్.. టెర్రరిస్టులకు ఆవాసం ఇస్తు, భారత్ పై దాడి చేయడానికి ఉసిగొల్పుతుంటుంది. అదే విధంగా పాక్ లో ముఖ్యంగా బెస్ క్యాంపులు ఏర్పాటు చేసి మరీ భారతపై యువతకు దాడిక ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ ఎల్లప్పుడు కూడా భారత్ ను ఏదోరకంగా దెబ్బతీయాలనే కుటీల పన్నాగాలు చేస్తుంటుంది.
Read more: Breakups Leaves: ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్.. బ్రేకప్ అయిన వాళ్లకు అన్ లిమిటెడ్ లీవ్స్..
కానీ మనదేశం మాత్రం, మనకు చెడు చేసిన వాళ్లకు కూడా మంచి చేస్తునే, ప్రపంచం ముందు ఈరోజు ఒక శక్తివంతమైన దేశంగా ఉద్భవించింది. ప్రస్తుతం భారత్ తో స్నేహపూర్వక సంబంధాల కోసం అగ్రదేశాలు సైతం పోటీపడుతున్నాయి. భారత్ భవిష్యత్ రోజుల్లో ఒక అత్యంత శక్తివంతమైన దేశంగా ఏర్పడే రోజు దగ్గరనే ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter