Corona Anti Bodies: కరోనా యాంటీ బాడీస్‌తో పుట్టిన చిన్నారి, పరిశోధన చేస్తున్న వైద్యులు

Corona Anti Bodies: కరోనా వైరస్. ప్రపంచాన్ని గజగజ వణింకించిన మహమ్మారి. ఇప్పుడు మరోసారి పంజా విసురుతోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. అదే సమయంలో యాంటీబాడీస్‌తో పుట్టిన చిన్నారి సంచలనం కల్గిస్తోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 18, 2021, 02:42 PM IST
Corona Anti Bodies: కరోనా యాంటీ బాడీస్‌తో  పుట్టిన చిన్నారి, పరిశోధన చేస్తున్న వైద్యులు

Corona Anti Bodies: కరోనా వైరస్. ప్రపంచాన్ని గజగజ వణింకించిన మహమ్మారి. ఇప్పుడు మరోసారి పంజా విసురుతోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. అదే సమయంలో యాంటీబాడీస్‌తో పుట్టిన చిన్నారి సంచలనం కల్గిస్తోంది.

కరోనా వైరస్ (Corona virus) మహమ్మారి నుంచి రక్షణగా ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చేసింది. ఓ వైపు వ్యాక్సినేషన్(Vaccination) ప్రక్రియ కొనసాగుతుండగానే..కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. వ్యాక్సిన్ ఎంత వరకూ సమర్ధవంతంగా పనిచేస్తుందనే వార్తలు విన్పిస్తున్న తరుణంలో ఓ సంచలనమైన ఘటన చోటుచేసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడా(Florida)లో ఓ చిన్నారి యాంటీ బాడీస్‌( Baby with antibodies)తో పుట్టడమే దీనికి కారణం. సాధారణంగా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత శరీరంలో యాంటీబాడీస్ తయారవుతాయి. శరీరంలోకి వైరస్ ఎంటర్ కాకుండా అడ్డుకుంటాయి. ఈ చిన్నారి పుట్టుకతోనే వైరస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ఘంగా పుట్టింది. 

చిన్నారి పుట్టిన తరువాత బొడ్డుతాడు (Umblical chord) నుంచి సేకరించిన రక్తానికి పరీక్షలు చేసిన పాల్ గిల్బర్ట్, చాడ్ రుడ్విక్ అనే వైద్యులు ఈ విషయాన్ని నిర్ధారించారు. చిన్నారి కడుపులో ఉన్నప్పుడు తల్లి తీసుకున్న వ్యాక్సిన్ కారణంగా ఇది సంభవించిందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ యాంటీబాడీస్ ఎంతకాలం ఉంటాయి, ఎంతవరకూ రక్షణ ఉంటుందనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ విషయం తేలితే గర్భంతో  ఉన్న మహిళలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఏర్పడే పరిస్థితులు , ఇతర అంశాలపై స్పష్టత వస్తుందన్ని చెప్పారు.

Also read: Coronavirus in Dharamsala: ఏడాది తరువాత పంజా విసురుతోన్న కరోనా వైరస్, 150 మంది సాధువులకు పాజిటివ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News