Corona vaccine: అక్కడ వ్యాక్సిన్ ఉచితం, కంపెనీతో ఒప్పందం

దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ను ఉచితంగా అందించేందుకు ఆస్ట్రేలియా ( Australia ) సిద్ధమైంది. ఈ మేరకు ఆస్ట్రాజెనెకా కంపెనీ ( Astrazeneca ) తో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తమ దేశంలోనే ఉత్పత్తి చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచనున్నామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. 

Last Updated : Aug 18, 2020, 11:35 PM IST
Corona vaccine: అక్కడ వ్యాక్సిన్ ఉచితం, కంపెనీతో ఒప్పందం

దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ను ఉచితంగా అందించేందుకు ఆస్ట్రేలియా ( Australia ) సిద్ధమైంది. ఈ మేరకు ఆస్ట్రాజెనెకా కంపెనీ ( Astrazeneca ) తో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తమ దేశంలోనే ఉత్పత్తి చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచనున్నామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. 

7-8 నెలల్నించి ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ( Corona virus ) ను కట్టిడి చేయడానికి అగ్రదేశాలు రేయింబవళ్లు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా వ్యాక్సిన్ ( Vaccine ) అభివృద్ధి పనిలో పలు దేశాలు నిమగ్నమయ్యాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా కంపెనీ ( Oxford university-Astra zeneca ) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ఫలితాలు ఆశాజనంగా ఉన్నట్టు కన్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మూడో దశ ట్రయల్స్ లోో ఉన్న 5 వ్యాక్సిన్ లలో ఇదొకటి. మూడో దశ ట్రయల్స్ సమర్ధవంతంగా కొనసాగుతున్న ఈ వ్యాక్సిన్ డిసెంబర్ నాటికి అందుబాటులో వస్తుందని నమ్ముతున్నారు. ఈ నేపధ్యంలో ఈ కంపెనీతో ఆస్ట్రేలియా ప్రదాని స్కాట్ మోరిసన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. వ్యాక్సిన్ విజయవంతమైతే తమ దేశంలోనే ఉత్పత్తి చేసి పంపిణీ చేసే విధంగా ఆ కంపెనీతో ఆస్ట్రేలియా ప్రభుత్వం  అగ్రిమెంట్ చేసుకుంది. Also read: Corona Vaccine: నిన్న రష్యా...నేడు చైనా..వ్యాక్సిన్ కు ఆమోదం

Trending News