CM Jagan Tour: దావోస్‌లో సీఎం జగన్ టూర్ సక్సెస్..రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ..!

CM Jagan Tour: దావోస్‌లో సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా టూర్‌ సాగుతోంది. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని బృందం పలువురు పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2022, 08:01 PM IST
  • దావోస్‌లో సీఎం జగన్‌
  • పలు సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు
  • పెట్టుబడులు రావడంపై హర్షం
CM Jagan Tour: దావోస్‌లో సీఎం జగన్ టూర్ సక్సెస్..రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ..!

CM Jagan Tour: దావోస్‌లో సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా టూర్‌ సాగుతోంది. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని బృందం పలువురు పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలవుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలు, సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు కుదర్చుకుంది. తాజాగా గ్రీన్‌ ఎనర్జీకి సంబంధించి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులపై అదానీ, గ్రీన్‌కో,అరబిందోలతో ఒప్పందం కుదిరింది. 

వినూత్న విధానాలతో 27 వేల 700 మెగా వాట్ల క్లీన్ ఎనర్జీ ..రాష్ట్రంలోకి అందుబాటులోకి రానుంది. గ్రీన్‌కోతో కలిసి తాము ప్రపంచంలోనే తొలిసారిగా గ్రీన్‌ ఎనర్జీపై ఏపీలో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రపంచ ప్రసిద్ధ కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆ సంస్థ సీఈవో ఆదిత్య మిట్టల్ అధికారికంగా ప్రకటించారు. ఏపీలో పారిశ్రామిక విధానాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.  

భారీ వార్షిక ఆదాయం ఉన్న ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్‌..గ్రీన్‌ ఎనర్జీని వేదికగా చేసుకుని ఏపీలోకి వస్తోంది. కొత్త తరం ఇంధనాలు హైడ్రోజన్, అమ్మెనియా ఉత్పత్తులపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కర్బన రహిత పారిశ్రామికీకరణకు ఏపీ కేంద్రంగా నిలుస్తోంది. నీతిఆయోగ్ సైతం ప్రశంసించింది. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకుని పారిశ్రామిక ఉత్పత్తుల దిశగా మచిలీపట్నంలో ఎస్‌ఈజెడ్‌ రానుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ఏస్ ఆర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. 

అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ దిశగా దావోస్‌లో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులోభాగంగా డబ్ల్యూఈఎఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. డబ్ల్యూఈఎఫ్‌ నిర్వహించే కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో ప్రభుత్వం భాగస్వామ్యం కానుంది. రాష్ట్రంలో కొత్తగా 4 పోర్టులు రాబోతున్నాయి. ఆ దిశగా దావోస్‌ సభలో సీఎం జగన్ ఫోకస్ చేశారు. పలువురు పారిశ్రామిక వేత్తల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. 

తాము త్వరలో కాకినాడలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు మిట్సుయి ఓఎస్ లైన్స్ లిమిటెడ్‌ ప్రెసిడెంట్, సీఈవో తకిషి హషిమొటో వెల్లడించారు. విశాఖలో పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా సీఎం జగన్ గట్టి కృషి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీతో కలిసి హై ఎండ్ టెక్నాలజీపై పాఠ్య ప్రణాళిక రూపకల్పన చేసేందుకు టెక్‌ మహీంద్ర అంగీకారం తెలిపింది. 

ఏపీలో విద్యా రంగానికి అండగా ఉంటామని బైజూస్ ప్రకటించింది. పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. పాఠ్య ప్రణాళికను విద్యార్థులకు అందిస్తామని సీఎం జగన్‌కు ఆ సంస్థ సీఈవో రవీంద్రన్‌ వివరించారు. సమగ్ర భూసర్వే రికార్డుల భద్ర పర్చడంలో సహాయ సహకారాలు అందిస్తామని కాయిన్ స్విచ్‌ క్యూబర్‌ వెల్లడించింది. పర్యాటక రంగానికి కృషి చేస్తామని ఈజ్‌మై ట్రిప్‌ ప్రతినిధులు తెలిపారు. 

Also read:Rajat Patidar Marriage: ఐపీఎల్ 2022 కోసం.. పెళ్లి వద్దనుకున్న బెంగళూరు ఆటగాడు రజత్ పటీదార్!

Also read:Hyderabad Rain: భాగ్యనగరంలో ఈదురుగాలుల బీభత్సం..కార్లు ధ్వంసం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News