దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరోసారి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత ఏడాది పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది లాక్‌డౌన్ విధించే సాహసం చేయడం లేదు. కానీ విపరీతంగా పెరిగిపోతున్న కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారత్‌పై ఆంక్షలకు కారణాలుగా మారుతున్నాయి. తద్వారా ఎయిర్ ఇండియా బుధవారం నాడు ఓ కీలక ప్రకటన చేసింది.
యునైటెడ్ కింగ్‌డమ్(United Kingdom) భారత విమాన సంస్థ ఎయిర్ ఇండియా సర్వీసుల రాకపోకలు వారం రోజులపాటు తాత్కాలింకంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 24 నుంచి వారం రోజులపాటు భారత్ నుండి యూకేకు, అదే విధంగా యూకే నుండి భారత్‌కు ఎయిర్ ఇండియా సర్వీసులు రద్దయ్యాయి. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్(CoronaVirus) కేసులు, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత్‌ను యూకే రెడ్ లిస్ట్‌లో చేర్చింది. దేశం నుంచి యూకేకు ప్రయాణాలపై ఎన్నో ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా సర్వీసులు తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఖాతాల్లో ఎయిర్ ఇండియా ప్రకటన చేసి ప్రయాణికులను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో దాదాపు 3 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2000కు పైగా ప్రజలను కోవిడ్19 బలిగొంది.
Also Read: Covisheild Vaccine Price: కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలు ప్రకటించిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
(2/2)Between 24th to 30th April '21 we are in a process to schedule once a week flight to UK from Delhi & Mumbai. Information regarding the same will also be updated on our Website and Social Media Channels .
— Air India (@airindiain) April 21, 2021
యూకే ప్రభుత్వం ఇటీవల భారత్ నుంచి ప్రయాణాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు అందుబాటులో ఉండవు. ఇదివరకే టికెట్లు బుక్ చేసుకున్న వారికి త్వరలోనే నగదు రిఫండ్ చేయనున్నామని ప్రకటనలో తెలిపింది. ముంబై, ఢిల్లీ ప్రాంతాల నుంచి యూకేకు విమాన సర్వీసులపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారని సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.
Also Read: Face Mask Mistakes: ముఖానికి మాస్క్ ధరిస్తున్నారా, అయితే ఈ పొరపాట్లు మాత్రం చేయవద్దు
రద్దయిన విమాన సర్వీసుల వివరాలు ఇవే..
AI131/AI130
ఈ ఎయిర్ ఇండియా విమాన సర్వీసు ముంబై నుంచి లండన్, ఆపై లండన్ నుంచి మళ్లీ ముంబై మార్గం
AI161/AI162
ఈ ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు ఢిల్లీ నుంచి లండన్‌కు, అదే విధంగా లండన్ నుంచి ఢిల్లీ మార్గంలో
AI131/AI178
ముంబై నుంచి లండన్, ఆపై లండన్ నుంచి బెంగళూరు మార్గంలో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు
AI177/AI130
ఈ ఎయిర్ ఇండియా విమాన సర్వీసు బెంగళూరు నుంచి లండన్, ఆపై లండన్ నుంచి ముంబై మార్గాల మధ్య అందించే సర్వీసులు తాత్కాలికంగా రద్దయ్యాయి.
Also Read: COVID-19: కరోనా వైరస్ ఎంత సమయంలో వ్యాపిస్తుందో తెలుసా, నిపుణులు ఏం చెప్పారంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook