అప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో తాలిబాన్ ఉగ్రవాద సంస్థ దారుణానికి పాల్పడింది. కాబూల్‌లో ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమీపంలో రద్దీగా వున్న ప్రదేశంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు నిల్వ చేసి వున్న ఓ అంబులెన్స్‌లో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 40 మంది మృతిచెందగా మరో 140 మంది వరకు గాయపడినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి వహీద్ మజ్రో తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్టు తాలిబన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
#WATCH: Spot of the bomb blast in Kabul which killed 17, injuring 110 #Afghanistan pic.twitter.com/jenhdgdlQI
— ANI (@ANI) January 27, 2018
అంబులెన్స్ నిండా పేలుడు పదార్ధాలే నిల్వ చేసి వుండటంతో పేలుడు తీవ్రత అధికంగా కనిపించింది. దీనికితోడు పేలుడు అనంతరం వెలువడిన దట్టమైన పొగ సైతం స్థానికులని ఊపిరి ఆడకుండా చేసిందని ప్రత్యక్షసాక్షులు చెప్పినట్టు తెలుస్తోంది. పేలుడు ధాటికి సమీపంలోని భవనాల కిటికీలు కంపించాయి. తాలిబన్ల దాడిని దుశ్చర్యగా పేర్కొన్న అప్ఘనిస్థాన్ ప్రభుత్వం.. ఈ దాడిని తీవ్రంగా ఖండించింది.