Indonesia boat accident: ఇండోనేసియాలో ఘోర ప్రమాదం.. పడవ మునిగి 26 మంది గల్లంతు!

Indonesia boat accident: ఈ మధ్య కాలంలో పడవ ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇండోనేషియాలో జరిగిన బోటు ప్రమాదంలో 26 మంది గల్లంతయ్యారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : May 29, 2022, 04:45 PM IST
Indonesia boat accident: ఇండోనేసియాలో ఘోర ప్రమాదం.. పడవ మునిగి 26 మంది గల్లంతు!

Indonesia boat accident: ఇండోనేసియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. 43 మంది ప్యాసెంజర్స్ తో వెళ్తున్న ఫెర్రీ బోటు దక్షిణ సులవేసి (Sulawesi) రాష్ట్రంలోని మకస్సార్ జలసంధిలో (Makassar Strait) మునిగిపోయింది. ఈ ఘటనలో (boat capsize) 26 మంది గల్లంతయ్యారు. వాతావరణం అనుకూలించక పోవడం వల్ల పడవ మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు. టగ్‌బోట్‌ల ద్వారా 17 మందిని రక్షించినట్లు అధికారులు స్పష్టం చేశారు. మకస్సార్ లోని పాటోరే నౌకాశ్రయం నుండి గురువారం అర్ధరాత్రి బయలుదేరిన ఈ పడవ.. పాంగ్​కెప్ రీజెన్సీలోని కల్మాస్ ఐలాండ్​కు వెళ్లాల్సి ఉంది. మధ్యలోనే ఈ దుర్ఘటన సంభవించింది. మునిగిపోయిన పడవ ప్రదేశం గురించి సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతైన వారి కోసం 40 మందితో కూడిన రెస్క్యూ బృందం వెతుకుతుంది. 

ఇండోనేసియా (Indonesia)...17వేలకు పైగా దీవుల సమూహం. ఈ దేశంలో తరుచూ పడవ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక్కడి ప్రజలు రవాణాకు ఎక్కువగా ఫెర్రీలను ఉపయోగిస్తారు. భద్రతా చర్యలు పాటించకపోవడం వల్ల ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. గత వారం తూర్పు నుసా టెంగ్‌గారా ప్రావిన్స్‌లోని లోతులేని నీటిలో 800 మందికి పైగా ప్రయాణిస్తున్న ఫెర్రీ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. 2018లో సామర్థ్యానికి మించి 200 ప్రయాణీకులతో వెళ్లిన ఫెర్రీ మార్గ మధ్యలో మునిగిపోయింది. ఇందులో 167 మంది ప్యాసెంజర్స్ మృత్యువాత పడ్డారు. 1999లో ప్యాసెంజర్ షిప్ మునిగిపోయి 312 మంది చనిపోయారు. ఈ ప్రమాదం ఆ దేశంలోనే అతిపెద్ద దుర్ఘటనగా నిలిచిపోయింది. 

Also Read: Flight Missing: నేపాల్‌లో విమానం అదృశ్యం, 22 మంది ప్రయాణికుల భద్రతపై ఆందోళన 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News